Police Arest Cheste

Bojja Tarakam / బొజ్జా తారకం · Books

Police Arest Cheste book cover

Price: Rs. 95. పోలీసులు అరెస్టు చేస్తే ఏం చెయ్యాలి? అసలు పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తారు? అరెస్టు చేసిన వ్యక్తిని రోజుల తరబడి పోలీసు స్టేషన్ లో ఉంచవచ్చా? లాకప్ లో పెట్టి, కొట్టి చంపవచ్చా? అరెస్టు చేసిన వ్యక్తిని ఎప్పుడు కోర్టు ముందు హాజరుపరచాలి? బెయిలు ఎలా దొరుకుతుంది? అరెస్టు అయిన వ్యక్తిని పోలీసులు చిత్రహింసలు పాల్టేస్తే ఎవరూ ఏమీ చెయ్యలేరా? పోలీసులు తప్పుడు కేసులు ఎందుకు బనాయిస్తారు? అధికారం లేకుండా అరెస్టు చేస్తే మీరు అడ్డగించవచ్చా? అరెస్టు అయిన వ్యక్తికి అన్నం ఎవరు పెడతారు? లాకప్ ఎందర్ని ఉంచాలి? ఇవన్నీ ప్రశ్నలే... ఎన్నో ప్రశ్నలు సమాధానం దొరకక ప్రజల్ని భయపెడతున్నాయి. అసలు పోలీసు అంటే ప్రజలకు భయం ఎందుకు! పోలీసు గురించి, చట్టం గురించి, హక్కులు గురించి ప్రజలకు తెలియదు గనుకనే పోలీసు అంటే భయం. ఆ భయం పోతే ప్రజలు తమ హక్కుల్ని సాధించుకోగలరు. అందుకే ఈ పుస్తకం....

Browse more Telugu books