PM Cares Nidhi

Editor · New Arrivals

PM Cares Nidhi book cover

Price: Rs. 25. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు కేంద్ర సమాచార కమిషనర్గా 2013 నుంచి 2018 వరకు పనిచేశారు. ఈ బాధ్యత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కేంద్ర ఎన్నికల కమిషనర్ హెూదాతో సరిసమానమైనది. సమాచార హక్కు కోసం పౌరులు చేసుకున్న వేలాది అప్పీళ్లను పరిష్కరించారు. పాత్రికేయ విద్యలో నాలుగు బంగారు పతకాలు, న్యాయవిద్యలో ఒక బంగారు పతకం సంపాదించారు. వాక్ స్వాతంత్ర్యం, ప్రజామాధ్యమాలు, చట్టాలపైన పరిశోధించి డాక్టరేట్ పొందారు. గోప్యత, సమాచార హక్కుల మధ్య సంఘర్షణపై 2018లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చి చేసి ఎల్ ఎల్ డి పట్టా పొందారు. భారత రాజ్యాంగం గుర్తించిన హక్కులను, సమాచార హక్కును ప్రజలకు లభింపచేసేందుకు పాలక పార్టీలకు తలవంచకుండా ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించిన మేథావి. ఇదివరకు నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా లో న్యాయశాస్త్ర ప్రొఫెసర్గా, అంతకు ముందు పాత్రికేయుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ సమీపంలోని బెన్నెట్ యూనివర్శిటీ లా స్కూల్ డీన్ గా పనిచేస్తున్నారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. న్యాయ శాస్త్రం, జర్నలిజం, సమాచారహక్కు పైన 38 పుస్తకాలు రచించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఎం ఎస్ ఆచార్య, రంగనాయకమ్మ దంపతులకు వరంగల్లో 1956లో జన్మించారు.

Browse more Telugu books