Pitchuka Meeda Brahmastram / పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
గన్నవరపు నరసింహమూర్తి. / Gannavarapu Narasimhamurthi. · Stories & Poetry

Price: Rs. 135. నేను ఎంటెక్ (సివిల్ ఇంజనీరింగ్) చదివాను. రైల్వేల జాయింట్ జనరల్ మేనేజర్ పని చేసాను. భార్య శకుంతల, పిల్లలు పరాశర శ్రీనివాస్, శ్రీ కీర్తన, కోడలు పూర్ణ, అల్లుడు కార్తీక్; మనవడు అరవింద్, మనవరాలు రుత్విక, మా అబ్బాయి శ్రీనివాస్ బిట్సపిలానీలో ఇంజనీరింగ్ చదివి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లోలో సైంటిఫిక్ ఆఫీసర్ ఎఎఫ్ పని చేస్తున్నాడు. కోడలు పూర్ణ బ్యాంక్ ఆఫీసర్, అలాగే మా పిల్ల కీర్తన కూడా బ్యాంక్ ఆఫీసర్, అల్లుడు కార్తీక్ బార్క్ లో సైంటిఫిక్ ఆఫీసర్ (ఎఫ్) గా పని చేస్తున్నారు. ఇదీ నా కుటుంబ నేపథ్యం. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నాను. నేను విజయనగరం జిల్లా బొబ్బిలి దరికుసుమూరు అనే అగ్రహారంలో పుట్టాను. ఇక సాహితీ ప్రస్థానానికి వస్తే ఇప్పటి వరకు 720 కథలు, 36 నవలలు వ్రాసాను. సుమారు 25 కథలకు, 6 నవలలకు బహుమతులు వచ్చాయి. ఇక ప్రచురణ విషయానికొస్తే నేను ఇప్పటి వరకు (1) గంధం చెట్టు (2) తూర్పు పడమర (3) ఉడుతా భక్తి (4) గాలివాన (5) వీణా వేదనం (6) గమ్యం (7) అక్షరాభ్యాసం (8) మట్టివాసన అనే 8 కథా సంపుటాలు ప్రచురి ంచాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం నా తొమ్మిదవ కథా సంపుటి. అలాగే తూర్పు సంధ్యారాగం, అంకురం, అగ్నిపథం, మట్టి మనుషులు, స్వర్ణమయూరం, అరణ్యం, ధర్మచక్రం, మట్టి వాసన అనే నవలలు ప్రచురించబడ్డాయి. ఇంకో పది నవలలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కథా సంపుటిలో 29 విభిన్న రకాల కథలు ప్రచురించబడ్డాయి. ఈ కథలన్నీ వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికల్లో ప్రచురించబడి పాఠకాదరణ పొందినవే కావడం విశేషం. - గన్నవరపు నరసింహమూర్తి