Pineapple Jam

Editor · Stories & Poetry

Pineapple Jam book cover

Price: Rs. 135. ఆలుమగలు విడిపోయేంత విషాద స్థితిని ఒక ఉద్యోగం ఆబదిలీ నేపధ్యంలో తేలిగ్గా తీసుకొమ్మని చెప్పి ఒక కథ ఊరడిస్తుంది ('ట్రాన్స్ ఫర్'). ఆలుమగలు ఒకరికొకరు ఇచ్చుకునే బహుమతులు పగిలిపోయినా ప్రేమ పదిలంగానే ఉంటుందని మరో కథ ఓదారుస్తుంది (పైనాపిల్ జామ్). పరమాణువు వంటి పరమ చిన్న పదార్థంలో ప్రోటాన్లు, న్యూట్రాన్ల వంటి మరింత చిన్న పదార్థాలుంటాయి. చిన్న చిన్న ఘటనల్లో ఇమిడిపోయి ఇంకా చిన్న చిన్న సంఘటనలుంటాయి. ప్రతి అతి చిన్న ఘటన/వస్తువు సమస్త విశ్వగోళానికి మినీ రూపమే. 'లడ్డూ కావాలా' నుంచి 'పైనాపిల్ జామ్' వరకు ఇందులో ఏ కథా... చదవడానికి రెండు నిమిషాలు పట్టదు. ఘటన లోతు సముద్ర తలం కింది రహస్యంలా ఒక పట్టాన వొదలదు. ప్రతి కథలో... కథకుడు చెప్పిందాని కన్న చదువరి తన మనస్సులో రాసుకునేదే చాల ఎక్కువ. సంగతంతా బండగా చెప్పి, పాఠకుడి ఆలోచనకు ఏమీ మిగల్చని కథల కన్నా విషయాన్ని సూచించి ఆలోచింపజేసేదే మంచి కథ. ఆ 'లక్షణాని'కి 'లక్ష్యం' అనదగ్గ చిన్న చిన్న కథలివి. - హెచ్చార్కె

Browse more Telugu books