Pillalu Nerchukovadam lo Thallidhandrulatho vachhe samasyalu
Editor · Best Selling

Price: Rs. 110. డా॥ సుంకర రామచంద్ర రావు 1951 ఆగస్టులో విజయవాడలో జన్మించారు. 'మార్క్, ఫ్రాయిడ్ తులనాత్మక అధ్యయనం' అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్శిటి నుండి డాక్టరేట్ పొందారు. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా 17 ఏళ్ళు పనిచేశారు. 'ICFAI విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ మెంబర్గా నాలుగేళ్ళు పనిచేశారు. హైదరాబాద్లో స్థిరనివాసం. 1. మీ గురించి మీకు తెలుసా!. 2. కమ్యూనిస్టు ఉద్యమం - సుభాష్ చంద్రబోస్, 3. వినవోయి అల్పజీవి (విల్వాల్మ్ రైక్), 4. పిల్లల సంపూర్ణ వికాసానికి పెద్దలతో, సమాజంతో వచ్చే సమస్యలు, 5. పిల్లలు నేర్చుకోవడంలో ఉపాధ్యాయులతో వచ్చే సమస్యలు, 6. పిల్లలు నేర్చుకోవడంలో తల్లిదండ్రులతో వచ్చే సమస్యలు 7. సమ్మర్ హిల్ పిల్లల పెంపకంలో సంచలనం తదితర పుస్తకాలను అనువదించారు. ఎ.ఎస్. నీల్ ఎ.ఎస్. నీల్ 1883లో స్కాట్లాండ్లోని ఫర్ఫార్లో జన్మించారు. ఎడింబరో విశ్వ విద్యాలయం నుంచి ఎం.ఎ.(ఇంగ్లీష్) పట్టా తీసుకున్నారు. 12 సంవత్సరాల పాటు స్కాట్లాండ్ ప్రభుత్వ పాఠశాలలో, రెండు సంవత్సరాల పాటు హాంప్ స్టీడ్లోని కింగ్ ఆల్ఫ్రెడ్ స్కూల్లో పని చేశారు. 1921లో డ్రెస్లైన్లోని హెల్లేరూలో మరి కొంతమందితో కలిసి అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేశారు. తరువాత ఆస్ట్రియాలోని సొన్నాటాగ్స్ బెర్గ్ ్కు ఈ స్కూలును మార్చారు. ఆ తరువాత ఇంగ్లాండ్కు తిరిగివచ్చి లిమిరెజిస్లో కొండపై ఉన్న సమ్మరిల్ అనే ఇంటిలో స్కూలు ప్రారంభించారు. లీస్టన్లోని సప్లోకు స్కూలును మార్చినపుడు, స్కూలుకు అదే పేరు కొనసాగించారు. ఇరవై పుస్తకాలను రచించిన ఎ.ఎస్.నీల్ స్వేచ్ఛాబడి ఉద్యమ కారుడు, గొప్ప రచయిత, విద్యావేత్త.