Pillala Samrakshana
Editor · Best Selling

Price: Rs. 90. డాక్టర్ సుభాష్ సి. ఆర్య మన దేశంలోని ప్రముఖ శిశు వైద్య నిపుణులలో ఒకరు. ఆయన గత 30 సం||రాలుగా పిల్లల వైద్యంలో అనుభవం గడించారు. అనేక మెడికల్ జర్నల్స్, మ్యాగజైన్లు, వార్తా పత్రికలలో పలు వ్యాసాలు రాశారు. 1990లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్కు అధ్యక్షుడిగా వున్న డా॥ ఆర్య. ప్రస్తుతం న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలోని శిశువైద్య విభాగంలో సీనియర్ కన్సల్టెంట్గా వున్నారు. ఈ పుస్తకం గర్భధారణ మొదలుకుని పిల్లల బాల్యదశ దాటేవరకు, వారిని పెంచడంలో తల్లితండ్రులకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం, ఆటపాటలకు సంబంధించిన అన్ని విషయాలలో అనేక సలహాలనిస్తుంది. అందరూ తప్పక దగ్గర వుంచుకోవాల్సినంత అవసరమైన మార్గదర్శి. అందుకే అందరూ దగ్గరుంచుకోవాలి. -ది టైమ్స్ ఆఫ్ ఇండియా డా|| ఆర్యకు శిశువైద్యంలో అపారమైన అనుభవం వుండడమేగాక, ఎంత క్లిష్టమైన సమస్య గురించైనా సాధారణమైన మాటలతో వివరించగలిగిన నేర్పు వుంది. తమ పిల్లల శారీరక, మానసిక ఉద్వేగాలకు సంబంధించిన అనేక సమస్యలను అవగాహన చేసుకుని, పరిష్కరించుకునే అవకాశం అనేకమంది తల్లితండ్రులకు సహకరించగలుగుతుంది ఆయన రాసిన ఈ పుస్తకం, రచయిత ఆచరణాత్మకంగా, వృత్తిపరంగా తనకు గల అపార అనుభవాన్ని గ్రంథ రూపంలో మలచడం ద్వారా తల్లులకు తమ పెంపకంపై విశ్వాసాన్ని, నేర్పరితనాన్ని కలిగించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన బాల్యానికి బాటలు వేశారు. ఆకట్టుకునే చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. -ఫెమినా ప్రస్తుతం న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలోని శిశువైద్య విభాగంలో సీనియర్ కన్సల్టెంట్గా వున్నారు.పిల్లల సంరక్షణకు సంబంధించి అనేక విషయాలను డా|| ఆర్య సున్నితమైన విషయాన్ని కూడా ఆసక్తికరంగా చదివించే రీతిలో రాశారు. ఆయన భారతీయ సామాజిక, సాంస్కృతిక సంప్రదాయాల ప్రత్యేకతను గుర్తించగలిగిన వ్యక్తి. - ది స్టేట్స్మన్