Pillala Kosam Arthika Shastram
Editor · Economics & Agriculture

Price: Rs. 110. పిల్లలకు సైన్సు విషయాలు కూడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం. ప్రకృతి విషయాల్లో, ప్రతీ సైన్సునీ నేర్చుకోనక్కర లేదు. వైద్య శాస్త్రం ప్రతీ మనిషికీ క్షుణ్ణంగా అక్కర లేదు. రోజువారీగా పాటించ వలసిన ఆరోగ్య సూత్రాలు తెలిస్తే చాలు. అనారోగ్యాలు మీద పడ్డప్పుడు, వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యు లకు తెలిసినంత శాస్త్రం, ప్రతీ మనిషికీ అక్కర లేదు. ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే. కానీ, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు. మనం మనుషులం; జంతువులం కాదు. జంతువు లైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి. వాటికి ఏ శాస్త్రాలూ, ఏ జ్ఞానాలూ, అక్కర లేదు. కానీ, మనుషులకు, మనుషుల సంబంధాల గురించి తెలియాలి. ఆర్ధిక శాస్త్రమే, మనుషుల సంబంధాల్నీ, వారి జీవిత విధానాల్నీ, వివరిస్తుంది. ఈ శాస్త్రమే, నిన్నటి -ఇవ్వాల్టి - రేపటి జీవితాల్ని చూపిస్తుంది. ఇది ప్రతి మనిషికీ తెలిసివుండాలి.