Petentlu, Praja sanskruthi, Bharathadesam lo Prajarogyam, Pracheena Bharathamlo Aharapu Alavatlu
Editor · Personality Development

Price: Rs. 95. నేటి ప్రపంచంలో పేటెంట్లు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నాయి. మీరు రైతులయితే విత్తనాన్ని నిల్వ చేసుకునే హక్కు ప్రమాదంలో పడుతుంది. మీరు వినియోగదారు అయితే ఆహారపు హక్కు, ఔషధ హక్కులకు ముప్పు వాటిల్లుతుంది. మీరు పరిశోధకులయితే విజ్ఞానాన్ని పంచుకునే హక్కు నిరోధించబడుతుంది. వాణిజ్య సంబంధింత మేథో హక్కుల ఒప్పందం (ట్రిప్స్) విశ్వజనీకరణం గురించిన కట్టుకథలను ఈ పుస్తకం బట్టబయలు చేస్తుంది. మేథోపరమైన ఆస్తి హక్కుల (ఐ.పి.ఆర్) పేరుతో బడుగు దేశాల సహజవనరులను పాశ్చాత్య కార్పొరేషన్లు ఎలా లూటీ చేస్తున్నయో వివరిస్తుంది. దేశీయ పరిజ్ఞానంపై ఆధారపడి ఉత్పత్తి చేసిన సరుకులకే వర్ధమానదేశాలు అధిక ధరలు ఎలా చెల్లించవలసి వస్తున్నదీ వెల్లడిస్తుంది. పేటెంట్ల చారిత్రిక పూర్వరంగాన్ని కూడా తెలియచేస్తుంది. ప్రత్యేకించి పర్యావరణ రంగంలో ప్రపంచీకరణ దుష్ఫలితాలను తెలుసుకోదలచిన ప్రతి ఒక్కరూ చదవాల్సింది. ఈ పుస్తకం. వందన శివ ప్రముఖ పర్యావరణ ఉద్యమ నాయకురాలు, కార్యకర్త, 1991లో ఆమె జీవవైవిధ్యాన్ని, సమగ్రతను ముఖ్యంగా విత్తనాలను పరిరక్షించడానికి కృషి సల్పే 'నవధాన్య' అనే సంస్థను స్థాపించారు. ప్రత్యామ్నాయ నోబుల్ శాంతి బహుమతిగా పేరుగాంచిన "జీవన భృతి హక్కు అవార్డు" 1993లో ఆమెకు లభించింది. పర్యావరణం, ఆహారం, వ్యవసాయ మొదలైన అంశాలకు సంబంధించిన అనేక పుస్తకాలను ఆమె రచించారు. ఆమె 'ఎకాలజిస్ట్' అనే పత్రికకు అసోసియేట్ ఎడిటర్ కూడా పని చేస్తున్నారు.. ప్రజా సంస్కృతి' అంటే కష్టజీవుల సంస్కృతి. ఇందుకు వ్యతిరేకమైనది ‘దోపిడి సంస్కృతి'. అయితే కొన్ని రకాల సంస్కృతులు ఇలా 'వర్గ' నిర్వచనం పరిధిలో లేనివయి కూడా ఉంటాయి. మనం 'జానపద సంస్కృతి' గా పిలుచుకునే సంస్కృతులు అన్నీ ఈ కోవకు చెందుతాయి. పాటలు, నృత్యాలు, నాటకాలు వంటివి జానపద సంస్కృతిలో భాగం. జానవద సంస్కృతిలో ప్రజలు ప్రేక్షకులుగానో, భాగస్వాములుగానో మాత్రమే కాకుండా సృష్టికర్తలుగా కూడా ఉంటారు. జానపద సంస్కృతి అనాది కాలం నుండి ఉనికిలో ఉంది. ఈ నాటికీ కొనసాగుతుంది. ప్రజల ఆట, పాట ఇంకా సజీవంగానే ఉన్నాయి. సామాన్