PERSONALITY DEVELOPMENT
Dr. T. S . ROA / డా॥ టి. ఎస్. రావు · Books

Price: Rs. 95. ప్రతివ్యక్తి సమాజంలో అందరికంటే ఉన్నతంగా వుండాలని గుర్తింపు పొందాలని కోరుకోవడం సహజం. అలా కోరుకునే ప్రతివాదు ఉన్నత స్థానాన్ని చేరుకోవడంగాని, గుర్తింపు పొందడంగాని జరుగకపోవచ్చు. దీని వెనుక ఎన్నో బలహీన కారణాలుంటాయి. ఎన్నో లోటుపాట్లుంటాయి. వీటి సన్నింటిని అధిగమించి తమని తాము తీర్చిదిద్దుకోవడం అన్నది వ్యక్తిగత బాధ్యత అని విస్మరించకూడదు. తమని తాము ఆత్మ పరిశీలన చేసుకుంటూ వ్యక్తితావాన్ని వికసింప చేసుకుంటుండాలి. ఇతరుల ఇష్టమైన విషయాలలో ఆసక్తిని చూపిస్తూ, వాటి గురించి మాట్లాడుతూ పుండాలి. ఆ ఆసక్తిలో మిమ్మల్ని మీరు కాసేపు తాత్కాలికంగా మరచిపోగలగాలి. ఇతరులు మనల్ని ఇష్టపడుతున్నారని భావించాలి ఇతరులతో మనం బాగా వుంటామని వారు అనుకొంటే మనతో వారు స్నేహంగా వుంటారు. మీరు గంభీరంగా వుంటే ఇష్టపడటం అటుంచి మిమ్మల్ని అసలు పట్టించుకోరు. ఎవరైనా అభినందించేటప్పుడు, పలకరించేటపుడు తగిన విధంగా ప్రవర్తించాలి. ఎవరికైనా నమస్కారం చెప్పవలసి వచ్చినపుడు 'హలో' అని పలకరించవలసి వచ్చినపుడు మాటలను పలకరింపు చిరునవ్వుతో వుండాలి. సాగదీయకూడదు. ఇతరులు ఏ విషయంలో అల్పభావంతో ఉన్నారో గ్రహించాలి. వారు దేని గురించి సందేహపడుతున్నారో గమనించి, అందుకు సంబంధించి అతని సామర్థ్యాల్ని ప్రశంసించడం చాలా మంచిది. కేవలం అతని గురించి కాకుండా చేసే పనులను గురించి వెన్నుతట్టి ప్రోత్సహించాలి. మీరు ఇతరులతో కలిసి పనిచేసేటప్పుడు వారు మీ గురించి చేసే వ్యాఖ్యలను, విమర్శలను సహృదయంతో స్వీకరించాలిగాని మిమ్మల్ని మీరు ఛీత్కరించుకొంటూ లేదా మిమ్ము వ్యాఖ్యానించిన వారి పట్ల కోపంతో రగిలిపోవడం చేయకూడదు. నేను, నా వాది ఇలాంటి వాటికన్నా ఎక్కువగా బహువచనాలను వాడినట్లయితే ఆది మీ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. ఇలా అనేక విషయాలపై మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కు దోహదపడే విధంగా ఈ పుస్తకం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నా ప్రయత్నం విజయవంతం అవుతుందని భావిస్తున్నాను.