Pavithra kutumbam

Editor · Best Selling

Pavithra kutumbam book cover

Price: Rs. 315. మార్క్స్, ఎంగెల్స్ ల తొలి ఉమ్మడి రచన : పవిత్ర కుటుంబం 1845 లో రచించిన 'పవిత్ర కుటుంబం ' గ్రంథంలో మార్క్స్, ఎంగెల్లు యువ-హెగెలియన్లపై దాడిచేస్తూనే ఏకంగా హెగెల్ భావవాద తాత్వికత 'నే విమర్శనాత్మకంగా విశ్లేషిస్తారు. అనువాదకుడు వై.వి. రమణారావు విశ్రాంత ఉద్యోగి శ్రమ, శ్రామికులు, పామరులు, భౌతికవాదం, చరిత్రలను చులకనచేసే భావవాద రచనలపై గల భౌతికవాదుల ' విమర్శ లపై "" విమర్శ 'నే ఒక మానవాతీత-శక్తిలోకి రూపాంతీక-రిస్తూ" బాయెర్ సోదరులు ' విమర్శనాత్మక విమర్శ ' చేస్తే, ఆ ' విమర్శనాత్మక విమర్శ 'పై మార్క్స్, ఎంగెల్స్లు ' గుణదోష-విశ్లేషణ (critique) చేస్తారు. బాయెర్ విమర్శనాత్మక విమర్శ వాస్తవాన్ని తాత్వికత ద్వారా స్పష్టమైన హాస్యంలోకి వక్రీకరిస్తుందనీ, తద్వారా అది స్పెక్యులేటివ్ తత్వశాస్త్రంపై గల భ్రమల గురించి పామరులకు సైతం బోధనచేసేదిగా అవుతుందనీ చూపటమే ఈ గ్రంథ లక్ష్యం అంటారు మార్క్స్, ఎంగెల్స్ లు. ఈ గ్రంథంలో విమర్శ, అమూర్తీకరణ, హెగెల్ తాత్వికత, స్పెక్యులేటివ్ తత్వశాస్త్రం, స్వీయ-చైతన్యం, పవిత్రత, వ్యక్తి పూజ/అనుసరణ, పరమాత్మ, సత్వాంశ, జీవాత్మ, పామరులు, మాస్ గురించీ: రాజకీయ, సామాజిక, మతపర, మానవ విమోచనాలు గల 'యూదు సమస్య ' గురించీ; మతం, దైవశాస్త్రం, భౌతికవాదం, రాజకీయార్థికశాస్త్రం, ప్రౌధాన్ గురించీ వుంటాయి. హెగెల్ తాత్వికతను ఖండించటంలో, భౌతికవాదానికి బలాన్ని చేకూర్చటంలో ఫోయబ్బాక్ చేసిన కృషిని కూడా వారు వివరిస్తారు. పారిస్ మర్మాలు అనే ఫ్రెంచి నవల్లోని పాత్రల ప్రవర్తనల, స్వభావాల, మోహం, ప్రేమ, వేశ్యావృత్తి, వగైరాల 'లోని మార్మికతలు సమాజ వర్గ స్థితినుండే, ఆ నవలా రచయిత ' యూజినీ సూ' యొక్క వర్గ స్వభావంనుండే జనించి తీరతాయంటూ మార్క్స్ ఆ నవల్లోని సంభాషణలనుండే 'పవిత్ర కుటుంబం' గ్రంథంలో మూడోవంతు భాగంలో ఉదహరిస్తూ, విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ అద్భుత సామాజిక వాస్తవాన్ని ఆవిష్కరిస్తాడు. ఈ గ్రంథంలోని యూదు సమస్యపై మరింత స్పష్టమైన అవగాహనకై మార్క్స్ విడిగా రాసిన ' యూదు సమస్యపై ' రచననూ, పవిత్ర కుటుంబం గ్రంథంలోని మార్క్స

Browse more Telugu books