Paurahakkula Udyama Dhruvatara

Editor · Biographies & Auto Biographies

Paurahakkula Udyama Dhruvatara book cover

Price: Rs. 108. రాజ్యాంగం, చట్టాలు, హక్కుల ప్రాధాన్యతను లోటుపాట్లను ప్రజలు పోరాటాలలోనే తెలుసుకుంటారు. పోరాటాలే హక్కులను రక్షిస్తాయి. హక్కులు వ్యక్తిగతంగా చాలా ఉపయోగం. అదే సమయంలో హక్కులు అన్యాయాన్నీ, దోపిడీనీ, పీడననూ ప్రశ్నించడానికి అవసరం. ఆ ప్రశ్నలకు అవసరమైన జ్ఞానాన్ని సమాజానికి అందించాల్సిన బాధ్యత మనదే. మనం ప్రతినిత్యం చైతన్యంతో, జాగురూకతతో ఉండాలి. సత్యం వైపుగా అన్యాయాన్ని ఎదిరిస్తూ దృఢంగా, సమిష్టిగా అడుగులు వేయాలి. జ్ఞానం మనలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపుతుంది. ప్రశ్నించే స్వభావాన్ని నిద్రలేపుతుంది. పోరాడే శక్తినిస్తుంది. కొత్త సవాళ్ళు, సామాజిక సంచనాలు సంభవించే ప్రతీ తరుణంలో మనల్ని మనం జ్ఞానంతో సుసంపన్నం చేసుకోవాలి. పోరాడే నిరుపేదలు, శ్రామికులు, రైతుల కోసం, వారి హక్కుల కోసం జ్ఞానం అనే ఆయుధంతో మనమెప్పుడూ సిద్ధంగా ఉండాలి. మాట్లాడే హక్కు పోరాడే హక్కుకు మద్దతుగా, సమిష్టిగా మనం గొంతు కలపాలి. అప్పుడే నూతన, మానవీయ సమాజం వైపుగా జరిగే ప్రయత్నాల్లో మనం కూడా సంతృప్తికరంగా పనిచేశామన్న సంతోషం మనకు శక్తినిస్తుంది. మన కార్యాచరణను విస్తృతం చేస్తుంది. ప్రజలకు దగ్గరవ్వాలి. ప్రజల్లో కలసిపోవాలి. - ప్రొఫెసర్ ఎస్. శేషయ్య

Browse more Telugu books