Pattana palana Muriki Vadalu-Veedi Vikrethalu
Editor · Personality Development

Price: Rs. 25. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు పట్టణ ప్రజల జీవన పరిస్థితులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. గృహ వసతి, త్రాగునీరు, పారిశుద్ధ్యం లాంటి సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు కల్పించాల్సిన సదుపాయాలకు డబ్బు చెల్లిస్తేనే అన్న ధోరణి అధికమయింది. ఈ క్రమంలో మురికి వాడల్లో నివసించే పట్టణ పేదల బ్రతుకులు మరింత దుర్భరంగా మారాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల సమయంలో ఈ సమస్యలు ప్రస్ఫుటంగా ముందుకొచ్చాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి వీటికి సంబంధించి ఒక విధానం అంటూ కూడ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో మురికి వాడలు, వీధి విక్రేతలపై జాతీయ ముసాయిదా విధానాలు చర్చకు దోహద పడతాయన్నది ఈ ప్రచురణ ఉద్దేశం.