Party-Prajasanghala Nirmanam

Editor · Best Selling

Party-Prajasanghala Nirmanam book cover

Price: Rs. 55. కార్మికవర్గ ప్రయోజనం కోసం పనిచేసేదే కమ్యూనిస్టు పార్టీ. అన్ని రకాల శ్రామికుల విముక్తి కోసం పనిచేసేదే కమ్యూనిస్టు పార్టీ, బూర్జువా పార్టీలు ఇందుకు భిన్నంగా, పెట్టుబడిదారుల, భూస్వాముల, ఇతర ధనిక వర్గాల ప్రయోజనం కోసం పనిచేస్తాయి. ప్రస్తుతం దేశంలో అధికారం వారి చేతుల్లోనే ఉన్నది. ఈ రాజ్యాంగ యంత్రం వారి ప్రయోజనాలనే కాపాడుతున్నది. అమలులో ఉన్న వ్యవస్థను కాపాడుకోవటమే వారి లక్ష్యం. కానీ ఈ వ్యవస్థను, రాజ్యాంగ యంత్రాన్నీ సమూలంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నది కమ్యూనిస్టు పార్టీ. ఇందుకు పాలక వర్గాలు అనుమతించవు. అణచివేతకు పూనుకుంటాయి. అణచివేత విధానాలను తట్టుకుని, ప్రతిఘటించే శక్తుల చేతుల్లో ఆయుధమే కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం. అందుకే పటిష్టమైన క్రమశిక్షణాయుత నిర్మాణం అవసరం. ఇందుకు తోడ్పడేదే కేంద్రీకృత ప్రజాస్వామ్యం. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికిది గుండెకాయ. కొత్త తరం కమ్యూనిస్టు శ్రేణులు దీని ప్రాధాన్యతను అర్ధం చేసుకునేందుకు ఈ చిన్న పుస్తకం తోడ్పడుతుంది.

Browse more Telugu books