Paris Commune lo Mahilala Patra

Editor · Women

Paris Commune lo Mahilala Patra book cover

Price: Rs. 10. స్త్రీలు పాల్గొనకపోతే ఏ విప్లవాలు జయప్రదంగావు. ముఖ్యంగా కష్టజీవుల విప్లవాలు అసలే సాధ్యంగావు. మహిళల హక్కులు ప్రతిధ్వనించనందునే 1789 విప్లవంలో స్త్రీల పాత్ర మృగ్యం అయింది. దాదాపు అదే కథ 1848లోనూ పునరావృతం అయింది. కాని పారిస్ కమ్యూన్ నాటికి మహిళలు మహాప్రవాహంలా కదిలి ఆ ప్రదర్శనల్లో, ప్రతిఘటనోద్యమాల్లో, నగర సంరక్షణలో బారికేడ్లు నిర్మించి శత్రువును చీల్చిచెండాడటంలో గణనీయమైన పాత్ర నిర్వహించారు. ఆ పోరాటంలో వేలకొలదీ అశువులుబాశారు. ఉరికంబాల కెక్కారు. మర తుపాకులకు బలైనారు. కఠిన శిక్షలకు, కారాగారాలకు ఎరలైనారు.

Browse more Telugu books