Paris Commune

రంగనాయకమ్మ / Ranganayakamma · Politics

Paris Commune book cover

Price: Rs. 45. స్థాయీ సైన్యమూ, పోలీసులూ, నిరంకుశాధికారులూ మత గురువులూ, న్యాయాధికారి వర్గమూ అనే శ్రమ విభజనాంగాలతో కూడినదే కేంద్రీకృత రాజ్యాధి కారం. కార్మిక వర్గం ఒక సారి అధికారంలోకి వచ్చిందంటే, అప్పుడిక అది. పాత రాజ్యాంగ యంత్రంతో వ్యవహారం సాగించలేదన్న వాస్తవాన్ని, ఆదిలోనే తప్పని సరిగా గుర్తించాలి. అప్పుడే సాధించుకున్న తన ఆధిపత్యాన్ని మళ్ళీ పోగొట్టుకోకుండా ఉండాలంటే, ఈ కార్మికవర్గం, ఒక వంక, ఇంతకుముందు తనకే వ్యతిరేకంగా వాడబడిన పాత నిర్బంధ యంత్రాంగాన్ని తొలగించి వెయ్యాలి. మరో వంక, తన ప్రతినిధుల, తన అధికారులు విషయంలో జాగ్రత్త తీసుకుని, వాళ్ళందరూ కూడా, ఎటువంటి మినహాయింపూ లేకుండా, ఏ క్షణం లోనైనా వెనక్కి పిలిపించబడగలరని ప్రకటించాలి. శ్రమ సాధనాలన్నింటినీఉత్పాదకులకు బదిలీ చేసి, తద్వారా ఆరోగ్యం గా ఉన్న ప్రతి ఒక్కరూ తన జీవిక కోసం విధిగా పని చేసేలా చేసి, తద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న పీడన పరిస్థితులను రూపు మాపి నప్పుడే, వర్గ పాలనకూ, పీడనకూ గల, ఏకైక ప్రాతిపదిక, తొలగి పోతుంది. కమ్యూన్, మానవ జాతిని, వర్గ సమాజం నుండి శాశ్వతంగా విముక్తం చేసే మహత్తర సామాజిక విప్లవ ఉషోదయం.!

Browse more Telugu books