Paper Boy to Editor
ఎస్. వినయ కుమార్ / S. Vinaya Kumar · Biographies & Auto Biographies

Price: Rs. 112. పొద్దున్నేలేచి ఇంటింటికి వార్తా పత్రికలు పంచాడు. తరువాత కాలంలో ఓ పత్రికకు ఎడిటర్ గా పనిచేశాడు.. ఇంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది లైవ్లో..? పేరులో ఉన్న వినయానికి ప్రతిభను, సహనాన్ని జోడించి ప్రజా జర్నలిస్టుగా ఎదిగిన వినయకుమార్ జీవిత చరిత్రే ఈ పుస్తకం. పేదరికం.. ఆకలిని.. చదువుతో జయించడమే కాకుండా, బాధితుల పక్షాన నిలబడే ప్రజాశక్తి దినపత్రికలో పనిచేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న వ్యక్తి ఆయన. కార్పొరేట్ అవకాశాలు ఉన్నా కార్మికులు, పేదల పక్షాన గొంతుగా నిలబడటానికే నిశ్చయించుకున్న వినయకుమార్ జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. మీడియాలో మేనేజ్మెంట్ ఆధిపత్యం సాగుతున్న ఈ కాలంలో, అసలు మీడియా అంటే ఎలా ఉండేది? ఎలా ఉండాలన్నది.. ఈ పుస్తకాన్ని చదివి తెలుసుకోవచ్చు. నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా నలుగురికి ఉపయోగపడేలా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న క్రమమే ఈ 'పేపర్బాయ్ టు ఎడిటర్'.