Pandiri Pattemancham

Editor · New Arrivals

Pandiri Pattemancham book cover

Price: Rs. 180. రచనల్లో ఆర్ద్రత ఉండాలంటే రచయిత గుండెల్లో 'తడి' ఉండాలి. మానవతా విలువల పరిమళమే జాస్తి రమాదేవి కథలు. అంతరించిపోయే వృత్తులు.. కృతజ్ఞతలు లేని మనుషుల్లోని మానసిక అవకరాలు.. అణగారిన వర్గాల పట్ల ఆధిపత్య కులాల అహంభావ ధోరణులు.. రేపటి సూర్యుడి కోసం ఆశగా ఎదురుచూసే మనుషుల్లోని ఆశావహ దృక్పథం.. అణిచివేతలోంచే కొత్తగా ఊపిరి పోసుకొనే స్వభావం.. ఇవ్వన్నీకలుపుకుంటే అవి జాస్తి రమాదేవి కథలు అవుతాయి. జాస్తి రమాదేవి చేయి తిరిగిన రచయిత్రి పాఠకుల్ని కథలోకి ఎలా పరకాయ ప్రవేశం చేయించాలో ఆమెకు పెన్నుతో పెట్టిన విద్య, సాహిత్యాభిమానులు, యువరచయితలు తప్పక చదవాల్సిన సంపుటి ఇది! -శరత్చంద్ర ఏ కథ చూసినా ఎత్తుగడ నుంచి ముగింపు వరకు చక్కని కౌశలం కనిపిస్తుంది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా పరిశీలించే ఓర్పు, భావవ్యక్తీకరణ స్పష్టంగా చేయగల నేర్పు ఒక రచయితకు చాలా అవసరం. ఆ రెండింటిలోనూ పట్టభద్రురాలు ఈ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి. ఈ కథా సంపుటాన్ని తెలుగు పాఠకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. - గొర్లి శ్రీనివాసరావు మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి ప్రకృతితో పాటు ఎదిగిన ఆణిముత్యం నా చెల్లెలు. వందల కథలు పేరెన్నికగన్న పత్రికలల్లో ప్రచురితమయ్యాయి. అవుతున్నాయి. ప్రస్తుతం తను రచించిన నవలలు కూడా పాఠకులు చదువుతున్నారు. గతకాలం నాటి లబ్దప్రతిష్టులైన రచయితల గురించి కాదు గాని ప్రస్తుత రచయితలకు జరుగుతున్న పోటీలలో ఎక్కువ బహుమతులు గెలుచుకున్న మొదటి పదిహేను మందిలో నా సోదరి జాస్తి రమాదేవి ఉంటుందని గర్వంగా చెప్పగలను. - ముసునూరి సుబ్బయ్యచౌదరి

Browse more Telugu books