PAMPATEERAM
ఓల్గా / volga · Novels

Price: Rs. 95. “పంపాతీరం” పంపానది ఒడ్డునున్న అరణ్యానికి సంబంధించిన కథ. మానవులను, మానవేతర ప్రాణి కోటినీ కలిపి ఉంచే జీవనచక్రంలో వేళ్ళూనుకున్న కథ. అతి సూక్ష్మజీవి నుంచీ, మహాకాయం గల ఏనుగు వరకూ, చిన్న గరికపోచనుండీ మహావృక్షం వరకూ, సూర్యుని నుంచీ చిమ్మచీకటి కమ్ముకున్న వర్షరాత్రి వరకూ అన్నీ ఆ జీవనచక్రంలో ఒక భాగమేననే ఆలోచన కలిగించే కథ. అరణ్యం తన ఒడిలో, తన నీడన, పుట్టి పెరిగి జీవించే ఏ జీవినైనా ఒద్దనకుండా, కాదనకుండా ఒడిలోకి తీసుకుంటుంది. ఆదివాసీ నాయకురాలు సి.కె.జాను “మదర్ ఫారెస్ట్” పుస్తకంలో రాసింది కూడా అదే! - కల్పన కన్నబిరాన్