Palapitta Katha - 2025 / పాలపిట్ట కథ - 2025

Editor · Stories & Poetry

Palapitta Katha - 2025 / పాలపిట్ట కథ - 2025 book cover

Price: Rs. 180. తెలుగునాట సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం తరువాత కథా ప్రక్రియనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. భిన్న వర్గాలకు, ప్రాంతాలకు, భావజాలాలకు చెందిన వారు కథలు రాస్తున్నారు. వస్తుశిల్పాల్లో ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని వందల మంది విస్తృతంగా రాస్తూ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఈ క్రమాన విభిన్న సమూహాలకు చెందిన వారి కథలను ఒకచోట చేర్చి సంకలనంగా తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా 'పాలపిట్ట కథ-2025' మీ ముందుకు వచ్చింది. 2023లో 'పాలపిట్ట' నుంచి దీపావళి ప్రత్యేక కథల సంచిక వెలువడింది. 2024లో 'ఉగాది' ప్రత్యేక కథల సంచిక వచ్చింది. ఈ ఏడాది విలక్షణమైన కథలతో ఈ సంకలనం రూపొందింది. మన సమాజ గమనాన్ని, మానవ నైజాన్ని, మనుషుల పోకడలను తెలియజేసే కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. వ్యవస్థలకీ, మనుషులకీ నడుమ సంఘర్షణను, మానవ మనస్తత్వంలోని వైచిత్రిని ప్రతిఫలించే కథలు ఇందులో చూడొచ్చు. చట్టాలు, నీతిసూత్రాలు, నిజాయితీ, నిబద్ధత అనే పదాలు చూడటానికి అందంగా ఉంటాయి. వీటికి అనుగుణంగా మనుషులు జీవించాలని, సామాజిక, పాలనా వ్యవస్థలు పని చేయాలని కోరుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ప్రవర్తించే నాయకులు, ప్రభుత్వాధికారులు, వైద్యులు ఎల్లెడలా తారసపడతారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేయడమే ఒక అనర్హతగా పరిణమించే సందర్భాలుంటాయి. ఇలాంటప్పుడు సానుకూలంగా ఆలోచించే వారు తమ చేతుల్లో లేని పరిణామాల పట్ల ఎలా స్పందిస్తారో ఈ కథలు చెబుతాయి.

Browse more Telugu books