Pahechan

Editor · Stories & Poetry

Pahechan book cover

Price: Rs. 180. గీతాంజలి కథల్లోని ముస్లిం సమాజం, ప్రత్యేకించి హిందూ ముస్లిం సరిహద్దు రేఖల మధ్యవున్న సమాజం, ముస్లిం సమాజంలోని స్త్రీలు.. పురుషులు వారిపై అమలవుతున్న హింస, అణచివేత, ఆర్థిక సంఘర్షణ, పాత-కొత్త సంస్కృతుల అస్తిత్వ పోరాటం వీటికి తెలుగు సమాజంతో వున్న సంబంధం ఏమిటి? ఈ కథల ద్వారా గీతాంజలి మనకు కలిగిస్తున్న "పహెచాన్" స్వరూపం ఏమిటి? ఒక ముస్లిమేతర స్త్రీగా ముస్లిం సమాజాన్ని గీతాంజలి అర్థం చేసుకుంటున్న తీరు సరయ్యిందేనా? ముస్లిం సమాజాల అధ్యయనంలో ఇప్పుడు కీలకమైన అంశంగా చర్చలో వున్న outsider / insider వివాదంలో గీతాంజలిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వున్న మొరటు వర్గీకరణ ప్రకారం 'తనది కాని' (?) వర్గం గురించి గీతాంజలి ఎందుకు రాయాలి? అట్లా రాస్తున్న క్రమంలో 'తన' వర్గం పరిధుల్ని దాటివచ్చి ఆమె మాట్లాడుతోందా? లేకపోతే, 'తన' వర్గ పరిమితుల్లోనే ముస్లిం సమాజాన్ని చూస్తోందా? ఆమె 'సానుభూతి'ని గానీ, 'సహానుభూతి'ని గాని ముస్లిం సమాజం ఎట్లా స్వీకరించగలదు? గీతాంజలి కథల్ని చదవడం అంటే ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం! హిందూ-ముస్లిం సమాజాల సరిహద్దుల్ని చుట్టిరావడం! విభజనకి ముందూ, వెనకా వున్న చరిత్రని శోధించడం! తెలంగాణాలో కొన్ని శతాబ్దాల ఉమ్మడి సాంస్కృతిక విలువల్ని ఆరా తియ్యడం!

Browse more Telugu books