Padi Lechina Keratam / పడి లేచిన కెరటం

గంటి భానుమతి / Ganti Bhanumathi · Novels

Padi Lechina Keratam / పడి లేచిన కెరటం book cover

Price: Rs. 135. హైదరాబాదులోని ఇసామియా బజారు నేను పుట్టి, పెరిగిన ప్రాంతం. మా నాన్నగారు మా ఊళ్ళో స్కూలు ఫైనల్ చదివిన తర్వాత హైదరాబాద్ దక్కన్ (ఆ రోజుల్లో హైదరాబాద్్న అలాగే పిలిచే వారు) మెహబూబ్ కాలేజీలో ఎఫ్.ఎ.లో చేరారు. అప్పుడు ఉర్దూ తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకని ఉర్దూ తీసుకున్నారు. ఆ తరువాత నిజాం కాలేజీలో బి.ఏ., ఎం.ఏ., లా- అన్నీ ఇక్కడే చదివారు. మా నాన్నగారు ఒకపక్క ఉద్యోగం చేస్తూ చదువుకున్నారు. అప్పట్లో నిజాం ప్రభుత్వం వారు చదువుకోడానికి సెలవు ఇచ్చేవారు. మా అమ్మ కూడా హైదరాబాదు రావడంతో మా చిన్నాన్నలు కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా ఉర్దూ నేర్చుకున్నారు. మా పెద్ద చిన్నాన్న అప్పుడే స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి బ్యాచ్లో చేరారు. మరో చిన్నాన్న చిరాగ్ అలీలేన్లో ఉన్న ఉర్దూ మీడియం స్కూల్లో చేరారు. ఆ రోజుల్లో తెలుగు మీడియం, తెలుగు స్కూళ్ళు కూడా లేవు. అంతా ఉర్దూనే.

Browse more Telugu books