Padamati Gaali

గంటి భానుమతి / Ganti Bhanumathi · Novels

Padamati Gaali book cover

Price: Rs. 135. ప్రీతి ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు లేరు. అమెకు చెప్పకుండా భర్త రాజీవ్, తనతో తన దేశం తీసుకుని వెళ్లి పోయాడు. రాజీవ్ నువ్వు ఓ తల్లిని తక్కువ అంచనా వేసావు. వాళ్ళు నా పిల్లలు. నా శరీరంలో ముక్కలు. అంతే కానీ నా జ్ఞాపకాలుగా ఉండకూడదు. వాళ్ళు నా జీవితం. నా జీవితాలు. నా పిల్లలు నాకు కావాలి. వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్ళగలను. ఆ కలలు, ఆశలు, అద్భుతాలు అన్నీ జరిగిపోయాయి. అప్పుడు మిగిలింది పోరాటం. పిల్లలని తన దగ్గరకు తెచ్చుకోడానికి కావలసిన ధైర్యం. నన్ను నేను పోగొట్టుకున్నాను అని అనుకున్నాడు రాజీవ్, -రెండు భిన్న సంస్కృతుల మధ్య ఇమడలేకపోతున్న తన మూలంగా మొదలైన యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలీదు కానీ సోనూ, మోను మాత్రం ఓడిపోతున్నారని అర్ధం అయింది. గడచిపోయిన కాలంలో ఆనందాన్ని ఇచ్చిన క్షణాలన్ని గుర్తు చేసుకుంటే అది నోస్టాల్జియా అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అది కదు, బెంగ. పిల్లల గురించి బెంగ. దేశం కాని దేశంలో ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా ఆదుకుని ఓ రకమైన భద్రతను ఇచ్చిన ప్రీతిని, జయేష్ మూలంగా, అంత నేరం ఆమె పైనే వేయడం, తన స్వార్ధానికి పరాకాష్ఠ. సాయం చేసిన వాళ్లని మర్చి పోకూడదు. తన అవసరానికి వాడుకుని, ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఉమ్మడి కుటుంబం, విలువలు అంటూ ఓ పెద్ద కారణాన్ని భూతద్దంలో చూపించడం ఎంత దుర్మార్గమో తెలిసింది. ఈ పిల్లలు తన పిల్లలే కదా! వీళ్ళ బాధ్యత తనది కదా! మరి తనెందుకు పారిపోతున్నాడు? నిందించడానికి ఎవరు లేరు, తనని తాను నిందించుకోవాలి. తను తప్పు చేసాడు. తనకి ప్రీతికి మధ్య ఓ గీత గీసాడు. అది పెద్దదయింది. దాన్ని దాటాలి. ఆ గీతని తనే చెరపాలి. తమ మధ్య ఏర్పడ్డ గోడను తనే కూల్చాలి.

Browse more Telugu books