OUT OF COVERAGE AREA

Editor · Best Selling

OUT OF COVERAGE AREA book cover

Price: Rs. 180. ఇవి కులం గుట్టును రట్టు చేసిన కథలు కులం పేరిట దళితుల్ని అవమానించి, హింసించి, సంహరించే దేశం ఆధునిక భారతదేశం ఎట్లయితదని పసునూరి ప్రశ్నిస్తున్నాడు. కారంచేడు నుండీ వాడపల్లి వరకు దళిత స్త్రీలను చెరచడంలో, దళితుల్ని చంపడంలో 'ప్రధాన స్రవంతి' రాజకీయాలన్నీ పోటీ పడుతున్న చోట కులం లేదని ఎలా అనగలం? ప్రేమైక నిలయమైన ఇంటిగుట్టును కాపాడడంలో అర్థం ఉంది గాని, కులగుట్టును కాపాడడంలో అర్ధం ఏముంటుంది? కుల హింసను, కుల ద్వేషాన్ని కాపాడడం తప్ప కులగుట్టులో మరేం లేదు. ఏ పట్టణానికేగినా, ఏ దేశాంతరాలకేగినా ఇంటా బయటా కులం నీడలా వెంటాడి హింసిస్తుంటే దళితులెలా కులగుట్టును దాచుకున్న దేశంగుట్టును కాపాడుతారు. నిలువెల్లా ద్వేషంతో నిండిన, హింసాయుతమైన అలాంటి కులగుట్టును రట్టు చేసిన కథలే ఇవి. అంటరానితనానికి, ఆర్ధిక సమస్యకు మధ్య లేని పోటీని తీసుకువచ్చి, ఆర్ధిక సమస్యల పరిష్కారమే ప్రధానమని చెప్పిన/చెప్పే ప్రగతిశీలుర ధోరణులను పసునూరి కూడా పసిగట్టాడు. అందుకే 'ఆత్మగౌరవం లేని చోట అన్నం ఎలా సహిస్తుంద'ని పసునూరి ప్రశ్నిస్తున్నాడు. అయితే పట్టణాలకు, దేశాంతరాలకు వలసవెళ్తే కుల వివక్ష, అంటరానితనం పోయాయని కాదు. ఆవి రూపం మార్చుకుని సరికొత్త దాడి చేస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలు, గోవర్ల భూవెంచర్లు, కుల(బ్రాహ్మణ) కాలనీలు అటువంటి ఆధునిక అంటరానితనాన్ని, కులవివక్షను ఎత్తి చూపుతున్నాయి. ఈ మనువాద భాగోతాన్నంతా పసునూరి తన కథల్లో చూపించాడు. స్థలకాల గమనాలలో నిర్దిష్టత ప్రాధాన్యతను గుర్తించడమే ఈ కథల విశిష్టత. నిర్దిష్ట స్థలకాలాలలో వాస్తవిక జీవితాన్ని పట్టించుకోకుండా సమకాలీన చారిత్రక గమనాన్ని సక్రమంగా అర్ధంచేసుకోవడం సాధ్యం కాదు. అలాగే భవిష్యత్ చరిత్ర నిర్మాణంలో ఏయే సామాజిక శక్తుల పాత్ర ఏమిటో సరిగ్గా గుర్తించలేము.

Browse more Telugu books