Osho Kathalu
Editor · Literature

Price: Rs. 270. సౌభాగ్య అసలు పేరు విజయ్కుమార్. సౌభాగ్య అన్నది అతని కలం పేరు. తెలుగు ఎం.ఎ చేశారు. అబిడ్స్లోని గ్రామర్ స్కూల్లో టీచర్గా పనిచేసి ఇటీవలె రిటైరయ్యారు. గత నాలుగు దశాబ్దాలుగా సౌభాగ్య తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలో విశేష కృషి చేశారు. సౌభాగ్య కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, సంధ్యా బీభత్సం, కృతాద్రవస్థ, సింహావలోకనం, పునరుత్థానం, ప్రేమ కవితలు, యాభై దాటిన యవ్వనం సౌభాగ్య కవితా సంపుటాలు. సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, వ్యాసాలు ద్వేషాలు సౌభాగ్య విమర్శ గ్రంథాలు. ప్రసిద్ధ ఉర్దూ కవులు, ప్రాపర్టియన్ కవిత, ఆధునిక ప్రపంచకవులు, రెండు వందల ఏళ్ళ జాన్కీట్స్, ఇరవయ్యో శతాబ్దం ఇంగ్లీషు కవులు, ఈ కాలం కవులు, వజ్ర శకలాలు, మొదలయినవి ప్రపంచ సాహిత్య పరిచయ గ్రంథాలు. శిఖామణి, యాకూబ్, ఆశారాజు, కందుకూరి శ్రీరాములు, కె.ఎస్. రమణ తదితర కవులపై కవిత్వ పరామర్శ గ్రంథాలు రాశారు. ఆస్కార వైల్డ్ ఆలోచనలు, నిత్య జీవితంలో ధ్యానం, అద్భుతమైన కథలు, పాశ్చాత్య సంగీతకారుల జీవితాలు, తావో తరంగాలు వంటి వైవిధ్య తాత్విక రచనలు చేశారు. అక్బర్ బీర్బల్ కథలు, గ్రీకు రోమన్ కథలు, ఈసఫ్ కథలు, మంచి మంచి కథలు వంటి ఎన్నో పిల్లల కోసం కథా సంపుటాలు తెచ్చారు. ప్రపంచ ప్రసిద్ధమైన జోక్స్ రెండు సంపుటాలు తెచ్చారు. సుప్రసిద్ధ మార్శికుడు ఓషో రచనల్ని తెలుగువాళ్ళకు పరిచయం చేసే పనిలో వున్నారు.