Oscar wilde pillala kathalu

సనామ • కార్టూనిస్టు శ్రీధర్ / Sanama, Cartoonist Sridhar, · Children's Books

Oscar wilde pillala kathalu book cover

Price: Rs. 95. ఆస్కార్ వైల్డ్ కథల్లో అడుగడుగునా తొంగిచూసే ఒక అంశం చమత్కారం. ఆయన కథల్లో నీతి ఉంటుంది. కాని ఇదీ ఈ కథలో నీతి అని ఆయన బహిరంగంగా ఎన్నడూ చెప్పడు. కథలో నీతి అంతర్లీనంగా ఉంటుంది. వంచనను, మోసాన్ని, అహంకారాన్ని ఆయన ఎండగడతాడు. అది కూడా నేరుగా కాదు. అందరికీ పైకి కనిపించే వంచనను ఆయన పట్టించుకోడు. ఆదర్శం మాటున, నయగారపు మాటల మాటున సాగే వంచనను ఆయన ఎగతాళి చేస్తాడు. అధికార దర్పం మాటున దాగిన నేలబారుతనాన్ని ఎత్తి చూపుతాడు. అదీ నేరుగా కాదు. తన రచనల్లో వ్యంగ్యాన్నీ చమత్కారాన్నీ ఆయన ప్రతిభావంతంగా ప్రయోగిస్తాడు. బాలలు తమ సునిశితమయిన పరిశీలనను పెంచుకోవడానికి వైల్డ్ కథలు తోడ్పడతాయి. ఈ కథల్లో చిన్న పిల్లల కథలూ ఉన్నాయి. పెద్ద పిల్లల కథలూ ఉన్నాయి. ఈ కథలన్నీ పెద్దలూ చదువుకోవచ్చు. పిల్లలకు నీతిని ముసురుగా విసుగు పుట్టించే తీరులోనే బోధించాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఆస్కార్ వైల్డ్ తన కథల్ని మందమతుల కోసం రాయలేదు. చురుకైన పిల్లల కోసం, పరిణత పెద్దల కోసం రాశాడు.

Browse more Telugu books