Oohalake Oopirosthe...
K. Harinadh / కె. హరినాథ్ · Stories & Poetry

Price: Rs. 130. హైదరాబాద్ పాతనగరం కవులనగానే అగ్రశ్రేణిలో గుర్తుకొచ్చే కవులలో కె హరనాథ్ ఒకరు. అటు పత్రికలలోనూ ఇటు అంతర్జాలంలోనూ కూడా హరనాథ్ కవిత్వం జనరంజకమవుతూ వుంది. కవిగా తానెంత భావుకుడో అంత అభ్యుదయ చింతకుడు కూడాను. కవిగానే కాదు ఎందరో ప్రముఖులను మరీ ముఖ్యంగా సినిమారంగ సెలబ్రీటీలను పరిచయం చేస్తూ తాను రాసిన వ్యాసాలు, ఇంటర్వ్యూల ద్వారా కూడా హరనాథ్ పేరు పాఠక లోకంలో సుపరిచితమే! ముఖ్యంగా భావకవిత్వ శాఖను అల్లుకుని తాను వెలయించిన కవిత్వం యొక్క మౌలిక సంకల్పం కూడా నేటి యువతరంలో నల్లపూసైపోతున్న ఆ ఆర్ద్రతను, లాలిత్యాన్నీ, ప్రణయోన్మీలనాన్నీ, ప్రేమ వైఫల్యాల నుంచి హింసా నేరాలు కాక క్రమా త్యాగగుణాలు విస్తరించాలన్న వివేకాన్నీ ప్రోదిచేసి తన కవితల ద్వారా ఆ మధురోహలకు ఊపిరులూదాలన్నది తన దృష్టి, తన ఆశయం. అందుకే ఊహలకే ఊపిరొస్తే.... అంటే తన భావాలను పఠితృ లోకం ముందు ఈ సంపుటి ద్వారా నావుకతతో పుటం పెడుతున్నాడు. స్నేహశిఖకే, ఊహాసుందరికే అంకితంగా షష్టిపూర్తి పై బడిన కవితలను హరనాథ్ సంపుటీకరించడం ఆహ్వానించదగిన విషయం.