Ontari

Sannapureddy Venkataramireddy / సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి · Novels

Ontari book cover

Price: Rs. 270. 2017 మే 26, 27, 28 తేదీలలో సెయింట్ లూయిస్ నగరంలో తానా 40వ వార్షికోత్సవం జరిగిన 21వ మహాసభల సందర్భంగా రెండు లక్షల రూపాయల బహుమతి మొత్తంగా తానా నవలల పోటీని నిర్వహించింది. ఈ పోటీకి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి, అమెరికా, ఇంగ్లాండ్ల నుంచి 55 నవలలు వచ్చాయి. ఈ నవలలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ప్రకటించిన రెండు లక్షల బహుమతి మొత్తాన్ని మూడు నవలలకు అందించారు. వాటిలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ఈ నవల 'ఒంటరి' ఒకటి. మాయమవుతున్న పల్లెజీవితంపై పట్టణ ప్రభావం నేపథ్యంతో సాగిన నవల ఇది. ఇందులో రెండు భాగాలున్నాయి. ఒకటి- పేరు ప్రఖ్యాతలు గడిం చిన ఒక డాక్టర్ అంతరించిపోతున్న ధాన్యపు జాతి కోసం ఆరు నెలల అన్వేషణ. రెండవది తన ప్రాణవాయువుతో పొలాన్ని బుజ్జగించి, సమస్త జీవకోటితో అత్యంత సహజంగా మమేకమై పోయిన మరో అంతరిస్తున్న జాతి- రైతు జీవితం.

Browse more Telugu books