Omkaara / ఓంకార

Vijayachandra / విజయచంద్ర · Novels

Omkaara / ఓంకార book cover

Price: Rs. 180. జీవితమే కవిత్వంగానూ, కవిత్వమే జీవితంగానూ గడిపే అరుదైన సమకాలీన కవి విజయచంద్ర. తన చూపు ప్రసరించినంత మేరలో, తన మనస్సును స్పందింపజేసిన సర్వ విషయాలనూ కవిత్వీకరించకపోతే అతనికి నిద్ర పట్టదు. కాల్పనికతనూ, వాస్తవికతనూ చిత్రమైనరీతిలో కలగలుపుకుపోయే కననమతనిది. ప్రస్తుతం వొడియా రాష్ట్రం లోకి నెట్టేసిన తెలుగు పట్టణం బరంపురం నేలలో పుట్టి, అక్కడే కొమ్మలు చాచుకుంటూ కవితావృక్షమై పెరిగిన విజయచంద్ర తెలుగు సాహిత్యంలో విలక్షణమైన outsider-insider గా రూపొందాడు. అందుకే ఆయన కవిత్వంలో అభిలషణీయమైన నిర్మోహత్వంతో బాటూ, అలుముకుపోయిన ఆత్మీయత కూడా ప్రతిఫలిస్తూ వుంటుంది. ప్రాంతీయతనుంచి విశ్వజనీయత వరకూ అలవోకగా యెదగడమనే సాధనలో ఆయన కవితా ప్రయాణం విజయవంతంగా సాగిపోతూవుంది. -మధురాంతకం నరేంద్ర ఈ కవి ఒక యోధుడూ ఒక సాధువు కూడా. ఇప్పటిదాకా అతడు వెలువరించిన తొమ్మిది కవితా సంపుటులు చదివితే అతడు ఈ దేశం కంఠమై గొంతుకలు లేని వారికి ఒక గొంతై మాట్లాడే కవి అని అర్ధం అవుతుంది. పేలడానికి సిద్ధంగా ఉన్న ఆగ్రహ మానవుడిలా అనిపిస్తాడు. అతడి జీవిత అనుభవాలు చదివితే ఆగ్రహంతో పాటు తోటి మానవసమాజం పట్ల అనునయం కూడా సమపాళ్ళలో రంగరించుకున్నాడని తెలుస్తుంది. తన కవితల్లో అతడు ఏకకాలంలో అగ్నిని అమృతాన్ని కురిపిస్తూ కనిపిస్తాడు. సమన్యాయం సమధర్మం కోసం అనవరతం తపిస్తాడు. -వాడ్రేవు చిన వీరభద్రుడు దాదాపు నాలుగు సంవత్సరాలుగా నేను విజయచంద్ర గారి కవితలు చదువుతున్నాను. మొదట యధాలాపంగా చదవడం మొదలు పెట్టిన నేను తర్వాత కాలంలో ఆశ్చర్యపోయాను. తర్వాత అబ్బురపడ్డాను. సమాజం పట్ల నేటి స్థితిగతుల పట్ల చుట్టూ జరుగుతున్న దురంతాల పట్ల వారు ఎంతగానో ఆవేదన చెందడం గమనించినప్పుడు చలించిపోవడం నావంతైంది. చెట్టు మీద పుట్ట మీద వికసిస్తున్న పువ్వు మీద చిగురిస్తున్న మ్రోడు మీద వాడి నేలరాలిన పండుటాకుపైనే కాదు, వారి టేబుల్ లైటు దగ్గర తారాడే దీపపు పురుగు మీద చివరకు చీమ మీద కూడా వారు ఒకే ద్రుష్టి సారించడం వారి సమద్రుష్టికి తార్కాణం. సమాజం పట్ల నేడు జరుగుతున్న అనేక అన్యాయాల పట్ల ఆయన అహ

Browse more Telugu books