Olga Nunchi Ganguku

రాహుల్ సాంకృత్యాయన్ / RAHUL SANKRITHYAYAN · Novels

Olga Nunchi Ganguku book cover

Price: Rs. 366. రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషా పండితుడు, గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు. సుమారు 10సం||లు సుదీర్ఘకాలాన్ని స్వాతంత్య్ర యోధుడిగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు, హిందూ సన్యాసిగాను, ఆర్య సమాజకునిగాను, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్దబిక్షువుగాను ఈయన పేరుపొందారు. ఆయన సుమారు 30 భాషలు నేర్చుకున్నారు. ఇంగ్లీష్, ఫెంచ్, జర్మన్, టిబెటన్, అరబిక్, సంస్కృతం, పాళి, ఉర్దూ, పర్షియన్, రష్యా, హిందీ, తమిళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు, రాయగలరు. రాహుల్ సాంకృత్యాయన్ ప్రపంచ ప్రఖ్యాత దేశదిమ్మరి. ఆయన జీవితంలోని అధిక భాగం ప్రయాణించటం, విజ్ఞానాన్ని సముపార్జించటం, దాన్ని తన రచనల ద్వారా ప్రజలకి అందించటంలోనే గడిచిపోయింది. వీరు చేసిన భాషా సేవకు కాశీపండితులు వీరిని 'మహాపండిత్' బిరుదుతో గౌరవించారు. బౌద్ధ వేదముల మూడింటిలోను ఈయన నిధి. అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు 'త్రిపీఠకాచార్య' బిరుదిచ్చారు. 1 ప్రముఖ హిందీ పండితుడు. మార్క్సిస్టు సిద్ధాంతం దృష్ట్యా, ప్రాచ్య, పాశ్చాత్య, భారతీయ తత్వశాస్త్రాలను శోధించి అసంఖ్యాకమైన రచనలు చేశారు. వ్యాసాలు రాశారు. వీరు రాసిన ఋగ్వేద ఆర్యులు, దివోదాసు, సింహసేనాపతి, విస్మృత యాత్రికుడు, మధురస్వప్నం, జయయౌధేయ, లోకసంచారి రచనలు తెలుగు వారికి సుపరిచితాలు. "ఓల్గా నుంచి గంగకు" రచన క్రీ.పూ.6000సం॥ నుండి 1942 వరకు మానవ సమాజానికి చెందిన కథల సమాహారం. ఈ రచన అనేక దేశీయ, విదేశీ భాషలలోకి అనువదింపబడింది. తెలుగు పాఠకులకు సుపరిచితమైన “ఓల్గా నుంచి గంగకు" రచనను 1941 సం॥లో నిర్బంధవాసంలో రాశారు.

Browse more Telugu books