Oka Viplavamatha Athmakatha

ఎస్.వి.ఎస్. నాగభూషణం / S.V.S. Nagabhushanam · Books

Oka Viplavamatha Athmakatha book cover

Price: Rs. 135. ప్రజల తాగునీటి రంగంలో నిష్ణాతుడైన ఆ మేధావి, ముప్పై తొమ్మిదేళ్లపాటు ఆ కృషిలో శ్రమించి కూడా, ఒక విలేఖరి ప్రశ్నతో, తీవ్ర అంతర్మథనానికి గురయ్యాడు. అంతటి నిస్వార్థజీవికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందీ “ప్రొఫెసర్ మకరందరావు" కథలో చూడండి... పేద దేశాలకు రుణాలిచ్చి ఆదుకునే ప్రపంచస్థాయి బాంక్, ఆ రుణాలివ్వడానికి కారణం "రుణజాలం”లో... ప్రపంచ రికార్డులకోసం అంతకంతకూ పెరుగుతున్న మోజుపై ఒక సెటైర్ "మకరందరావూ, ప్రపంచ రికార్డులూ"... ఉద్యోగాల కల్పనకోసం పరిశ్రమల సెజ్లంటూ ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఏర్పరచే సెజ్ల భవిష్యత్తుపై ఓ ఫోకస్ “అవసరం"లో... నిరుపేదల ఆకలి, బలవంతుల దోపిడీకి అడ్డురాకుండా చేసే ఒక అస్త్రం “రిమాండ్ ఖైదీ"... గిరిజనుల బతుకుల్ని బాగుచెయ్యబోయి, విగతజీవిగా మారిన ఓ త్యాగమూర్తికి “నివాళి"... ఇంకా, ఇంటర్ బోర్డుల లీలలూ, కార్పొరేట్ కాలేజీల మాయలూ, టేకోవర్ కాలేజీల కహానీలూ... పెంపుడు జంతువులపై మమతల పందిళ్లూ.. వీటిపై "కులంగాడు", "పరీక్షలు బాబోయ్ పరీక్షలు”, "పొగడ్తల రావు" వగైరా 17 కథలు... ఇవి ఒకకోవకు చెందితే, ఈ కింది కథలు మరో కోవకు... రష్యన్ మహావిప్లవ చరిత్రకు సంబంధిచిన చారిత్రక కథలు... రష్యన్ ప్రథమ విప్లవం (1905-07) విఫలమైన తర్వాత, విప్లవకారులపై జారిజం సాగిస్తున్న భయంకరవేటనుండి తప్పించుకోవడం కోసం, విప్లవ నాయకుడు లెనిన్ విదేశాల్లో ప్రవాసం ఉండేందుకుగాను సాగించిన సాహసోపేత ప్రయాణ గాథ “ప్రవాసం"... అలాగే లెనిన్ తల్లి మరియా అలెక్సాండ్రోవ్నా, తన భర్త ఉద్యోగిగా ఉండి అంకితభావంతో కృషి చేస్తూ మరణించగా, పెద్దకొడుకు అలెక్సాంద్ర్ సరోద్నిక్ (రైతాంగ) విప్లవంలో ఉరిశిక్ష పాలయ్యాడు. రెండోకొడుకు వ్లదీమిర్ (లెనిన్) శ్రామిక వర్గ విప్లవంలో ప్రవాసం వెళ్లాల్సిరాగా, మిగిలిన ముగ్గురు పిల్లలూ అదే విప్లవంలో జైళ్లపాలయ్యారు. తన అంత్యకాలంలో ఆమె, ఆ పిల్లల తల్లిగా సాగించిన తలపోతే “ఒక విప్లవ మాత ఆత్మకథ"... ఆసిక్తిదాయకమైన, ఆలోచనాత్మకమైన 19 కథల సమాహారం ఈ కథా సంకలనం...

Browse more Telugu books