Oka Nenu Oka Canada

Editor · Novels

Oka Nenu Oka Canada book cover

Price: Rs. 195. Memoirs By Yarlagadda Raghavendra Rao రంగురంగుల కలల్ని మూటగట్టుకుని ఏవేవో అదృశ్యలేపనాల్ని మనసులకు పులుముకుని భువనం నాలుగుచెరగుల నుంచి కెనడాకు ఎగిరెళ్ళిన వలసపక్షులందరూ బంగరుజీవితానికి అదే చిరునామా అనే భరోసాను గుండెలనిండా దట్టించుకున్నోళ్ళే. మరింతగా వసంతాన్ని పట్టితెచ్చి జీవితంవాకిట కట్టిపడేసుకోవాలనే తలపుతో, మనసు నిలువనీయని ఆరాటంతో ఉన్నవన్నీ వదులుకుని, మెరుపుల ఆనవాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళినోళ్ళే. తిరిగివెళ్ళడమనే ఆలోచనే లేకుండా స్థిరంగా కాళ్ళను మంచుమడుల్లో పాతుకోవడానికి కంకణబద్ధులై అడుగు మోపినోళ్ళే. అయితే చుట్టూ ఉన్న రంగుగుడ్డల మధ్య నిప్పులు చెరిగేదో, వెలిగేదో వాస్తవమంటూ ఒకటుంటుందిగా. అది చెరుగుతుందో, వెలుగుతుందో తెలివిడి తెచ్చుకుని, కలలకు కత్తెర్లు వేసుకుని నిజ ఆచరణలోకి అడుగిడతారో లేక తూలికలఉయ్యాలలోనే ఊరేగుతూ ఉంటారో మీ ఇష్టం. తలపులకావల నిలబడి వాస్తవికాంశాల్ని తరచి చూసుకుని, మనసును తరచుకుని, తరచుకుని మార్గం పరచుకోవడం ముఖ్యం.

Browse more Telugu books