Oka Hijra Athma Kadha

P. Sathyavathi / పి. సత్యవతి · Biographies & Auto Biographies

Oka Hijra Athma Kadha book cover

Price: Rs. 135. ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్ జెండర్ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్, ఈక్వెడోర్, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది. ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ల ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుంది. పుస్తకం అంతటా రేవతి తాను ఎదుర్కొన్న భయానక సంఘటనల గురించి చెబుతుంది కానీ ఎవరి సానుభూతినీ కోరదు. అమె అడిగేదొక్కటే. హిజ్రాలను అందరి మానవుల వలె కోరికలూ ఆశలూ వున్న తోటి మనుషులుగా చూడమని, ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పిన తీరు అభినందనీయమేకాక హృదయానికి హత్తుకునే విధంగా కూడా వుంది. తన లింగ మార్పిడి శస్త్ర చికిత్స గురించైనా, పోలీసులు పెట్టిన హింస గురించైనా, తన క్లయింట్స్ గురించైనా! జెందర్ గురించీ, పురుషాధిక్యత గురించీ ఆమె చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చాలా స్పష్టంగా శక్తివంతంగా వుండి స్త్రీ పురుషులతో పాటు మూడవ లింగాన్ని కూడా మనం మానవీయంగా అర్థం చేసుకునే విధంగా కృషి చెయ్యాలనే అవగాహనను కలిగిస్తుంది. -యోగిందర్ సికంద్, కౌంటర్ కరెంట్స్ ఈ మధ్య నా స్నేహితులు వీధుల్లో నడుస్తూ వుండగా ఒకామె వారిని కౌగలించుకుని నా ఫోన్ నంబర్ కోసం అడిగి. నాకు ఫోన్ చేసి నా పుస్తకం తనకెంత నచ్చిందో, తనకు హిజ్రాల పట్ల పూర్వం వున్న భయాలనూ అభిప్రాయాలనూ ఈ పుస్తకం ఎలా పోగొట్టిందో చెప్పింది. నా రచనతో ప్రజల హృదయాలను స్పృశించడం నాకు ముఖ్యం." - రేవతి, హిందూ ఇంటర్వ్యూ ఈ పుస్తకంలో హృదయాన్ని స్పృశించే ఆర్ద్రతతోపాటు కొంత హాస్య చతురత కూడా వుంది. ఆమె పట్ల ప్రేమ అంగీకారం కూడా వున్నాయి. చీర కట్టుకున్న రేవతిని చూసి - ఆమెని చూసి అందంగా చీర కట్టుకోడం ఎలాగో నేర్చుకోమంటాడు ఆమె అన్న తన భార్యతో, రోసమ్మా థామస్, డీ.ఎన్.ఏ రేవతి తనపై జరిగిన హింసనూ దౌర్జన్యాన్నీ ఒక్కొక్కటిగా చెబుతూ వుంటే పాఠకులు ఒక దిగ్రమకూ ఒక అపరాధభావానికీ మధ్య ఊగిసలాడుతూ వుంటారు. రేవతి ఆత్మకథ వ్యక్తి నుంచి సమాజానికి, సమాజం నుంచి వ్యక్తికీ తన కథనాన్ని ఫోక

Browse more Telugu books