Oka Deyyamtho Naa Prema Katha
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 225. సోషల్ మీడియా పరిణామాలపై వచ్చిన తొలి తెలుగు నవల బల్ల మీద చేతులు ఆన్చి ముందుకు వంగి, "నేను నిన్న రాత్రి రెండింటికి చని పోయాను డాక్టర్..." అన్నాను. బల్లకి అవతలి వైపు ఉన్న సైకాలజిస్టు నా వైపు కన్నార్పకుండా చూశాడు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నాకన్నా చిత్రమైన భ్రమలతో వచ్చిన చాలామంది మానసిక వ్యాధిగ్రస్తులని చూసి ఉంటాడు కాబట్టి అలా చూడటంలో చిత్రం లేదు. అయితే, నాకూ వారికీ తేడా ఏమిటంటే... నేను నిజంగా చనిపోయాను. హీరోకి దేవుడంటే ఇష్టం. మూఢ భక్తి లేదు. హేతువంటే నమ్మకం. ఇంట్లో అతడి తల్లి, తండ్రి, అన్న, వదిన... అందరూ మంచోళ్లే. స్వాముల పట్ల అతి మూఢ నమ్మకం. అపాయం లేని అతి మంచితనంతో హీరోని హింసిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక దెయ్యం "ఐ విల్ హెల్ప్ యు" అన్నది. "ష్యూర్. అంతకన్నానా" అన్నాడు. "కానీ నువ్వు నాకో సాయం చెయ్యాలి" అన్నది. అక్కడినుంచీ చిక్కులు ప్రారంభం అయ్యాయి.