Oka Akupacha Kala
Dr. Kasula Lingareddy / డాక్టర్ కాసుల లింగారెడ్డి · Stories & Poetry

Price: Rs. 108. జలపాతశబ్దంలోకి' కవితాసంపుటితో 1997లో అడుగుపెట్టాడీ కవి. 'ఎన్నాద్రి', 'అందని చందమామ', 'ఇడుపు కాయితం' తో కాసుల లింగారెడ్డి కవిగా తన ముద్రను స్పష్టంగానే మన ముందుంచాడు. ఇప్పుడీ 'ఒక ఆకుపచ్చ కల'. "ఆకాశంలో మబ్బు ప్రసవించిన చినుకు శిశువును ముద్దాడినపుడు ఆ కళ్ళలో ఉరిమిన మెరుపును చూశావా?"- ఈ చూపుతో ఈ కవి ప్రయాణిస్తున్నాడు. తనలో తాను మథనపడుతున్నాడు. ఘర్షిస్తున్నాడు. ఆ ఘర్షణ ఈ కవిత్వం. 'ఇక భూమే మాట్లాడుతుంది' అనే విశ్వాసాన్ని ప్రోదిచేస్తున్నాడు. ఆశల టార్చిలైటు పట్టుకుని 'కాలం అడుగులు' వేసే స్థితిని నిశితంగా పరికిస్తున్నాడు. "నువ్వు విత్తిన ఒక అనివార్య అంతిను పరిష్కారమనే కల సజీవంగానే ఉంది" అని జార్జిరెడ్డి కలను ఈ కవి లోలోపల పాడుకుంటూ సాగుతున్న మార్చింగ్ సాంగ్. మనిషికోసం ఈ కవి ప్రోదిచేస్తున్న 'ఒక ఆకుపచ్చ కల.'