OFF LINE
Editor · Best Selling

Price: Rs. 180. ముక్కామల జానకీరామ్ తెలుగు బాలల కథా సాహిత్యాకాశంలో కొత్త తార. ఐడి నేపథ్యంగా తన కథల వయ్యిని 'ఆఫ్ లైన్'గా ప్రారంభించి, ప్రధాన స్రవంతిలోకి రావడం అభినందనీయం. ఈ కొత్త కథల సంతకం భవిష్యత్తులో బాల సాహిత్య ప్రపంచంలో బంగారు దారుల మైలు రాళ్ళని దాటాలని కోరుతూ... జయహోూ! బాల సాహిత్యం. - పత్తిపాక మోహన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సంస్కృతంలో విష్ణుశర్మ ఎత్తుకున్న ఎత్తుగడను అందిపుచ్చుకొని, మంచి కథనంతో బాలల కథా రచనకు సంపూర్ణ న్యాయం చేస్తున్న మీకు అభినందనలు. పంచతంత్రపు ఒరవడిని పునికి పుచ్చుకొని, మీదైన శైలిలో ఆధునికతను జోడించి, కథలను మంచి ప్రామాణికతతో పిల్లలు సొంతం చేసుకునేలా నడిపిస్తున్న తీరు అమోఘం. మీరు బాలల కథా రచయితగా ఒదిగారు. ఇక వెనుతిరిగి చూడకు. - మాదగాని శంకరయ్య, సాహితీ విమర్శకులు. ఇటీవల కాలంలో బాలసాహిత్యంలో విస్తృతంగా కథలు రాస్తున్న యువ రచయిత ముక్కామల జానకీ రామ్. పిల్లల్లో నైతిక విలువలను పాదుకొల్పడానికి వీరి కథలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఆన్ లైన్ ప్రపంచంగా మారుతున్న కోవిడ్ అనంతర కాలంలో పిల్లలను పుస్తకం వైపు మళ్ళించడానికి ఈ "ఆఫ్ లైన్" కథలు ఒక చారిత్రక అవసరం, ముక్కామల జానకీరామ్ రాబోయే కొన్ని దశాబ్దాలకు బాల సాహిత్యానికి గొప్ప భరోసా సంతకం. -డా|| సాగర్ల సత్తయ్య, కవి, రచయిత, విమర్శకులు. ముక్కామల జానకీరామ్ గారికి బాలల కథకుడిగా ఎదగడానికి కావాల్సినటువంటి అన్ని లక్షణాలు పుష్కలంగా ఉ న్నాయి. పిల్లల మనసుకు అతి సామీప్యంగా జీవించేవారే ఇలాంటి కథలను రాయగలుగుతారు. వీరు ఒక కథకుడు మాత్రమే కాదు పిల్లల సైకాలజీ తెలిసిన ఒక మానసిక శాస్త్రజ్ఞుడు కూడా. ఈ కథా సంపుటి వీరికి తెలుగు బాల కథా సాహిత్యంలో ఒక బలమైన అదుగు. మునుముందు ఎన్నో విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఆల్ ద బెస్ట్.. -తుల శ్రీనివాస్, కవి రచయిత,