October Mahaviplava Charithra
Editor · History

Price: Rs. 108. మానవజాతి చరిత్రలో అక్టోబరు విప్లవానికి ఎనలేని ప్రాముఖ్యత ఉన్నది. అది అన్ని దేశాల పాలకవర్గాలకూ, దోపిడీ శక్తులకూ, ఇతరులను పలు రకాలుగా అణిచివేసే సమస్త పీడక సెక్షన్లకూ వెన్నులో వణుకు పుట్టించింది... మత్తేభం నిద్రించినా, దాని కలలో మృగరాజు కనిపించి భయపెట్టినట్లుగా, అక్టోబరు విప్లవం తిరిగి తలయెత్తుతుందేమోనని, పై శక్తులన్నీ కలత నిద్రతోనే కాలం గుడుపుతున్నాయి... కార్మికుల కదలికల్నీ, శ్రామికుల సంఘటనల్నీ, అన్నార్తుల ఆరాటాల్నీ అవి ప్రపంచ వ్యాప్తంగా జాగరూకతతో గమనిస్తున్నాయి. వీలయితే జోకొడుతున్నాయి. కాదంటే ద్రోణ్ సహాయంతో బాంబుల వర్షాల్ని కురిపిస్తున్నాయి. అయినప్పటికీ సింహస్వప్నం వారిని తిన్నగా కూర్చోనీయడం లేదు... అక్టోబరు విప్లవం నిజంగా తిరిగివస్తుందా? వస్తే ఈ సారి అది ఏదేశంలో వస్తుంది? భారతదేశంలో రావడానికి ఎంతకాలం పడుతుంది?... చరిత్రలో మిగిలిపోయిన ఎన్నో అంశాలకు జవాబు అక్టోబరు మహా విప్లవ చరిత్ర విప్లవాభిమానులకే గాక, చరిత్ర పట్ల ఆసక్తిగల వారందరికీ ఉపయోగపడే కథనం ఇది... - రచయిత శ్రామికవర్గ రచయిత నాగభూషణ్ చరిత్ర అంటే వర్తమానం గతంతో, భవిష్యత్తో చేసే సంభాషణ అని గతితార్కిక చారిత్రక భౌతికవాద విశ్వాసంతో, అపారమైన చరిత్ర జ్ఞానంతో విస్పష్టంగా ప్రకటిస్తున్నారు... నాగభూషణ్ని కదిలిస్తే కేవలం నూరేళ్ల బోల్షివిక్ విప్లవ ప్రభావాల గురించి మాత్రమే కాదు, రష్యా పుట్టుక, చరిత్ర భూగోళాల గురించి చెప్తాడనేది సుబోధకమైన పాఠ్య గ్రంథంలాంటి ఈ పుస్తకం చదివితే పాఠకులకే అర్థమవుతుంది. ఈ చరిత్ర వర్తమానంతో చేసిన సంభాషణ ఏమిటో మన కాలంలో, మన మైదానాల్లో ఆ బోల్షివిక్ విప్లవం ఏ పురుటి నొప్పులు అనుభవిస్తున్నదో ప్రవాహ సదృశ్యమయిన ఈ సాధికారిక పారవశ్య చరిత్ర రచన చరిత్ర విద్యార్థులకు ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. - వరవరరావు, విరసం