O THALLI ANTHARMATHANAM
గంటి భానుమతి / Ganti Bhanumathi · Novels

Price: Rs. 135. తేది పుస్తక రూపం దాల్చిన నా పదమూడో నవల, ఓ తల్లి అంర్మథనం నవల స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీ'లో పదిహేను వేల రూపాయలు గెల్చుకున్న నవల. ప్రతీ రచనకి ఓ నేపథ్యం ఉంటుంది. ఈ నవల రాయడానికి కారణం ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలు. ఒకవేళ ఇలా జరిగితే ఎలా ఉంటుంది అన్న సందేహానికి కొంచెం కల్పన జోడించి రాసాను. భయంకరంగా రేప్ చేయబడిన ఓ అమ్మాయి తల్లి అంతర్మథనం ఈ నవల. మర్మార్గ, దుష్ట శక్తులతో పోరాడి, అలసిపోయి, జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతూ చెల్లు ముళ్ళ తుప్పల్లో పడిఉన్న అమ్మాయి తల్లి అంతర్మథనమే ఈ నవల. తన కూతురి మరణానికి, కారణం అయిన వ్యక్తి తన ఫ్లాటు ఎదురు ఫ్లాటులో అంటున్నాడు అని తెలిసిన ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది. ఆమె మనసు ఓ రణస్థలిగా మారిపోతుంది. ఆలోచనల సుడిగుండం, ఎన్నో భేతాళ ప్రశ్నలు, ఆ తల్లి మనసుని చుట్టుముట్టాయి. ఇదే ఈ నవల. ఊహించని మలుపుతో ముగిసే ఈ నవలని ఇదివరకు వచ్చిన నా ఇతర వచనలలాగానే పాఠకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ నవలను స్వాతి మాసపత్రిక ఏప్రిల్ 2023 సంచికలో ప్రచురించిన సంపాదకులు శ్రీ వేమూరి బలరామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా అన్ని పుస్తకాలను ప్రత్యేక శ్రద్ధతో వెలుగులోకి తెస్తున్న స్నేహశీలి, ప్రముఖ 2. పుస్తక శిల్పి శ్రీ తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ గారికి అర్థవంతమైన ముఖచిత్రాన్ని సూపొందించిన ప్రముఖ కవి శ్రీ తుమ్మూరి రాంమోహన్రావు గారికి, శ్రీమతి ఎం. కవితారెడ్డి వారికి - డి.టి.పి. నిర్వహించిన శ్రీ కుడుపూడి భాస్కర్రావు (మను గ్రాఫిక్స్) గారికి -అందంగా ముద్రించిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ అధినేత శ్రీ ఎ. జగన్మోహన్రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎప్పటి వలెనే పాఠకులు ఈ నవలను కూడా ఆదరిస్తారని ఆశిస్తూ... - గంటి భానుమతి