O Pedda Thirogamanam ( Noothana Vidhya Vidhanam)
Editor · Politics

Price: Rs. 45. బిజెపి కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి మోడీ ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న ఈ కాలంలో విద్య కాషాయీకరణ ప్రయత్నాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. వాటి పరాకాష్టే 2020లో విడుదల చేసిన నూతన విద్యా విధాన పత్రం. దేశమంతా కోవిడ్ సంక్షోభంలో సతమతమవుతున్న సమయాన్ని ఇలాంటి కీలక విధాన పత్రం విడుదలకు ఎంచుకోవడం కూడ దానిపై విస్తృతంగా చర్చ జరగకుండా నివారించాలన్న దురుద్దేశంతోనే. ఇలా కాషాయీకరణ ఒక్కటే కాదు, నూతన విద్యా విధానం ఒక ప్రత్యేక తరహా విద్యను, ప్రత్యేక తరహా నిపుణులను తయారుచేసేదిగా ఉంది. కార్పొరేట్ రంగానికి ఉపయోగపడే 'ప్రతిభావంతులను' అవసరమైన పరిమిత పరిమాణంలో తయారుచేయడం కీలక అంశంగా ఉంది. కార్పొరేట్, కాషాయీకరణ బంధం విద్యారంగంలో కూడ స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది. మరో వైపున అత్యధిక సంఖ్యలో ఉన్న సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు 'వృత్తి విద్య' పేరుతో ప్రధాన స్రవంతి విద్యకు దూరం చేస్తున్నది. ఇలాంటి నూతన విద్యా విధాన స్వరూప స్వభావాలను వివరించే ప్రముఖుల వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.