O Kukka Athmakatha
Editor · Novels

Price: Rs. 135. ఒక సామాన్య గృహిణి తనచిన్నతనంలో తల్లి ప్రేమకు దూరమవుతుంది. వివాహానంతరం సంతోషకరమైన జీవితం గడుపుతున్నప్పటికీ చిన్ననాడు కోల్పోయిన తల్లి ప్రేమనే గుర్తుచేసుకుంటుంటుంది. అలాంటి స్త్రీ ఓ కుక్కను దగ్గరకు తీసుకొని పెంచుకుంటుంది. తాను కోల్పోయిన ప్రేమానురాగాలను ఆ కుక్కకు అంందిస్తుంది. అలాంటి అపురూపమైన ఆదరణకు నోచుకున్న ఓ కుక్క, దానికి ముందు మూడు తరాల కథే ఈ నవల. ఇది కేవలం వాటి ఆత్మకథే కాదు వాటి చుట్టూ అల్లుకుపోయిన మానవ సంబంధాల కథ కూడా. ఎవరి పట్లనయినా జాలి, దయ చూపడం కాదని, వారిని ప్రేమతో ఆదరించాలన్న అంశాన్ని రచయిత్రి ఎంతో హృద్యంగా, అద్భుతమైన కథాసంవిధానంతో వివరిస్తారు ఈ నవలలో. రజని నరహళ్ళి ప్రముఖ కన్నడ రచయిత్రి. మైసూరు విశ్వవిద్యా లయం నుండి పట్టభద్రురాలయిన రజని కూర్గ్ జిల్లాలో జన్మించారు. పుస్తక పఠనం పట్ల అమితాసక్తి కలిగిన ఆమె బహు గ్రంథరచరాుత్రి. 'నాన్న అజయి జగత్తు' (2003, 2017), 'ఆత్మవృత్తాంత' (2013)తో సహా పలు నవలలు రచించారు. ఆత్మవృత్తాంత నవలకు కర్నాటక సాహిత్య అకాడమీ 2017 ఉత్తమ నవలా అవార్డు, కర్నాటక మహిళా రయితయితల అసోసియేషన్ అవార్డుతో సహా పలు ప్రముఖ అవార్డులను రజని స్వంతం చేసుకున్నారు. భర్త నరహళ్లి సుబ్రమణ్యతో ఆమె బెంగుళూరులో నివసిస్తున్నారు. రాజేశ్వరి దివాకర్ల, స్వయంగా కవయిత్రి. చేయితిరిగిన అనువాదకురాలు. పలు ప్రసిద్ధ గ్రంథాలను కన్నడం నుండి తెలుగు, తెలుగు నుండి కన్నడంలోనికి అనువదించారు. 'అక్క మహాదేవి జీవితము, సాహిత్యము', కన్నడ దళిత కవి సిద్ధ లింగయ్య ఆత్మకథను 'వూరు వాడ' పేరుతోను కన్నడం నుండి, తెలుగులోకి అనువదించారు. తెలుగు నుండి కన్నడంలోకి అనువదించిన ఎన్. గోపి కవితాసంకలనం. "కాలాన్ని నిద్రపోనివ్వను" కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించింది. బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన రాజేశ్వరి బెంగుళూరు ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసరుగా పనిచేశారు.