Nurella Dhalitha Udhyamam, Bharatha Vibhajanaku Karakulevaru Muslim la? brahmanula?
Editor · Politics

Price: Rs. 80. దళిత ఉద్యమ చరిత్రను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే దాన్ని రెండు దృక్కోణాల నుండి పరిశీలించాలి. మొదటిది అత్యంత అమానుషమైన అంటరానితనాన్ని తమపై రుద్ది అసమానత, అణచివేతలను కీర్తించిన హిందూ సామాజిక వ్యవస్థను తిరస్కరించి ఒక నూతన సామాజిక వికాసం కోసం జరిగిన మేధోపోరాటం. రెండోది దళితేతరులు దళితులపై వేసిన ముద్రలను తొలగించుకుని తమ స్వంత అస్తిత్వాలకోసం సాగించిన ప్రగతిశీల ఉద్యమం. క్రైస్తవ మిషనరీలు, సంఘ సంస్కర్తలు, ఇతర మానవతావాదుల రచనలను ఆధారంచేసుకుని దళితుల చరిత్రను, దళిత ఉద్యమాలను నమోదుచేసిన వైనం, వలసయుగంలో దళిత ఉద్యమంలో చోటుచేసుకన్న మార్పులు, వలసానంతరకాలంలో దళిత ఉద్యమం పరిస్థితి వీటి సమన్వయం ద్వారా చర్చ చేయవచ్చు. సాధారణ చరిత్ర రచనలను పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బోధపడతాయి. వలసపాలన కాలంలో వివిధ ప్రాంతాలలో జరిగిన సంఘటనలను, దళితుల చైతన్యం ఎడల తృణీకార వైఖరిని అనుసరించాయి. భారత సామాజిక నిర్మాణం గురించి వివరించే సందర్భంలో భారత సామాజిక వ్యవస్థను వర్ణించే సందర్భంలో కూడా దళితుల గురించి ఒక చిన్న విభాగాన్ని కేటాయించి దాన్ని అంటరానితనాన్ని ఒక ప్రాచీన చారిత్రక అవశేషంగా చూపించి సరిపెట్టారు. అక్కడక్కడ జరిగిన ఒకటి, అరా విశ్లేషణాత్మక రచనలను మినహాయిస్తే ప్రత్యేకంగా దళిత ఉద్యమాలను ప్రస్తావించలేదు.