NK Samagra Rachanalu /

Editor · Stories & Poetry

NK Samagra Rachanalu / book cover

Price: Rs. 360. ఎన్ కె నాకయినా, విరసంకయినా కవిగా, గాయకునిగా పరిచయమయ్యాడు. ఆయన నిలువెల్లా స్పందించి కదిలిపోతే తప్ప రాయడు. అంటే ఇది తన మనసు తోనే కాదు. కళ్ల నుంచి, కాలి మునివేళ్లదాకా నరనరాన జీర్ణమవుతూ కంఠదఘ్నంగా వెలువడితే తప్ప పాడడు. ఆయన అట్లా ఒక్క ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహి "నగర్ లో అప్పటికింకా శివుడు 'తూర్పు పవనం వీచెనోయ్' తో మాత్రమే కాదు, విరసం సభలంతటా, 1983లో తన లాల్ బనో గులామీ చోడో వచ్చేదాకా కూడా, వచ్చినాక కూడా శివసాగర్ పాటలు, జాలరన్నా, ఏటికెదురీదు వాళ్లమురా, 2. తోటా రాముని తొడకు కాటా తగిలిందాని, చెల్లీ చెంద్రమ్మా పాటలతోనే పరిచయం. - వి వి వరంగల్ నుంచి ఆనాటి ఆంధ్రప్రదేశ్ను, ఆడవులను, మానవ హృదయాలను, కళలను, గాయాలను తడుముతూ, కారిన రక్తాన్ని, కన్నీళ్లను కత్తులుగా మలిచే విప్లవ చైతన్యంతో బరువెక్కిన, పదునెక్కిన కవితలు ఎన్ .కె రామారావువి. 1970 నుండి 1990 లోపు ఇరవై ఏళ్ల కాలం మీద విప్లవోద్యమ సిద్ధాంతాన్ని, నిర్మాణ పరిణామాలను, ఆచరణ చరిత్రను, చరిత్రను నిర్మించిన మనుషులను తెలియజేసే కవిత్వం ఇది. ఇదంతా ఒక ఎత్తు. లాల్ ఐనో గులామీ చోడో బోలో వందే మాతరం మరొక ఎత్తు. 1983లో మొదటిసారి ఇది ప్రచురించబడితే 30 ఏళ్ల తర్వాత 2014లో నరేంద్ర మోడీ పాలన మొదలైన తరువాత విరసం ఈ దీర్ఘ కవితను తిరిగి ముద్రిస్తూ సామ్రాజ్యవాదం, హిందూ మతోన్మాదం మధ్య బలమైన పొత్తు కుదిరి ఫాసిస్టు రూపు తీసుకొంటున్న సందర్భానికి ఇదెంతో అవసరమైన అర్థవంతమైన కవిత అని పేర్కొన్నది. - కాత్యాయనీ విద్మహే

Browse more Telugu books