Nizam Navabulu
కాకాని చక్రపాణి / Kakani Chakrapani · History

Price: Rs. 157. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో ఉన్న దాదాపు ఐదువందల యాభై సంస్థానాల్లో హైదరాబాదు సంస్థానం వైశాల్యంలోనూ, జనాభాలోనూ అతి పెద్దది. కొత్తగా ఏర్పడ్డ స్వతంత్రభారతంలో చేరిన తుది సంస్థానం కూడా అదే. మొగలు అధికారం పతనమవుతున్న దశలో ఏర్పడిన ఈ రాజ్యం బ్రిటిషు సార్వభౌమత్వం కింద అనేక నిమ్నోన్నతాలకు లోనైంది. పద్దెనిమిదో శతాబ్దిలో బ్రిటీషు వాళ్లతో సైన్యసహకారపద్ధతి సంధి చేసుకొని తమ స్వయం ప్రతిపత్తినీ, స్వతంత్ర కార్యాచరణ అధికారాన్ని కోల్పోయిన తొలి రాజులు కూడా నిజాములే. బ్రిటిషు సార్వభౌమత్వం కింద అతి ఎక్కువగా నష్టపోయిన రాజ్యం కూడా హైదరాబాదే. భారతస్వాతంత్య్రం తర్వాత విలీనాన్ని పదమూడు. నెలలపాటు ప్రతిఘటించి నిలిచిన సంస్థానం హైదరాబాదు. ఈ పుస్తకం నిజాముల హైదరాబాదు రాజ్యస్థాపన, ఉత్థానం, తిరుగు ముఖం, చివరికి భారతసైనిక చర్య ద్వారా భారత సమాఖ్యలో విలీనం వరకు చారిత్రక పరిణామాలను నిష్పాక్షిక ధోరణిలో పరిశీలిస్తుంది. ఈ పరిణామాలలో భాగస్వాములయిన పాత్రధారులందరి చరిత్రనూ వివరిస్తుంది.