Nitya Jevithamlo Panikocche Chitkalu
పి. రాజేశ్వరరావు / P. Rajeshwara Rao · Books

Price: Rs. 65. దాదాపు సంవత్సరంక్రితం నేను నా ఆత్మీయ మిత్రులు శ్రీ యం.వి.భద్రంగారు నిర్వహిస్తున్న "హోఁ ఫర్ సీనియర్ సిటిజన్స్" (అన్నారం, మెదక్ జిల్లా) కు వెళ్ళాను. వారు సాహిత్యాభిమానియేకాక ప్రజలకు తనకు చేతనైన సేవలు చేయాలనే తపన, సేవాభావంగల మనీషి, శ్రీ ఎం.వి. భద్రంగారు ఎన్నో పత్రికలు, పుస్తకాలు, వ్యక్తులు తదితరులనుండి సేకరించిన చిట్కాలను నాకు చూపించి "వీటిని ప్రజలకు వుపయోగపడేలా చేస్తారా?" అని అడగ్గా "సరే యివ్వండి చూద్దాం!" అన్నాను నేను. ఆ తదుపరి నా పనుల్లోపడి వాటి జోలికే వెళ్లలేదు. కొంతకాలం తరువాత వీటిని క్రమపద్ధతిలో పెట్టడం కొంత కష్టమనిపించినా పాఠకుల సౌకర్యార్థం హసంబంధమైనవి, ఆరోగ్య, సౌందర్య సంబంధమైనవి అని రెండు భాగాలుగా విభజించి అకారాది క్రమంలో వుంచాము. భాషలోను కొంత ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ బాధ్యత నేనే తీసుకున్నాను. ఈ పుస్తకం శ్రీ ఎం.వి.భద్రంగారు ఎన్నో ఎళ్ళు శ్రమకోర్చి సేకరించి దాచివుంచడంవల్ల సాధ్యపడింది. అందుకు భద్రంగారికీ, ఈ చిట్కాలను రాసినవారికి, చెప్పినవారికి, వారి వారి పత్రికల్లో ప్రకటించిన ఆయా పత్రికాధిపతులకు, లాభాపేక్షలేకుండా ప్రచురించి మీ హస్తాల్లో వుంచిన ప్రతిభపబ్లికేషన్స్ వారికీ, నా కృతజ్ఞతలు, అభివందనలు. ఇందులోని చిట్కాలు ఎన్నో కొన్ని మీకు తెలిసినవే అనిపించినా సమయానికి గుర్తుకు రావు. కనుక పుస్తకరూపంలో మీవద్ద వుంటే మా మిత్రుడు శ్రీ ఎం.వి.భద్రంగారి కోరిక తీరుతుందని, తద్వారా ఎంతోమంది పాఠకులకు ఈ చిట్కాలు వారి నిత్యజీవితంలో పనికొస్తాయని నా విశ్వాసం. ఈ చిట్కాలు గృహిణులకేగాక అందరికీ వుపయోగపడేవి. ఈ పుస్తకంలో దాదాపు 1800 చిట్కాలు గృహ, ఆరోగ్య, సౌందర్యానికి సంబంధించినవి వున్నాయి. కనుక మీరు ఈ పుస్తకాన్ని ఎవరికి బహుమతిగా యిచ్చినా సంతోషిస్తారు. మిమ్మల్ని కలకాలం గుర్తుంచుకుంటారు.