Nissabda Kutra-Adrushya Rajya Charitra
Editor · Politics

Price: Rs. 260. నిశ్శబ్ద కుట్ర • అదృశ్య రాజ్య చరిత్ర • జోసీ జోసెఫ్ మానవ సమాజ పరిణామ క్రమంలో రాజ్య అవసరం ఎందుకు కల్గింది అనే చిక్కు ప్రశ్నకు భిన్నమైన వివరణలు, విశ్లేషణలు సైద్ధాంతికపఠ చర్చలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. వర్గ సమాజంలో బలవంతులు తమ ఆధిపత్యాన్ని, దోపిడీని కొనసాగించడానికి రాజ్యమనే ఆయుధాన్ని పాలకవర్గాలు సృష్టించాయి అనేది మార్కిస్టు విశ్లేషణ. ఉదారవాద సిద్ధాంతంలో (Literary theory) రాజ్య పూర్వ సమాజంలో మనుషులు ఏ నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా జీవించగా, సమూహాల మధ్య ఘర్షణ వల్ల అభద్రతకు గురికావడం పల్ల భద్రతకొరకు తమ స్వేచ్ఛను కొంత వదులుకొని రాజ్య నియంత్రణకు అంగీకరించారు. లేదా తమ సమ్మతిని (consent) తెలిపాడనేది మరొక విశ్లేషణ, మొత్తంగాఏ దృక్పథమైన సారంశంలో రాజ్యం ఒక బలప్రయోగ సాధనం అనేది అందరూ అంగీకరిస్తున్నారు. రాజ్యం అంతిమంగా వ్యవస్థీకృత హింస, ఈ దశ దాటి మానవాళి రాజ్యరహిత అంటే హింసలేని సమాజంగా పరిణామం చెందుతుందని మార్చే కాక గాంధీ కూడ ప్రతిపాదించాడు. అలాంటిసమాజం ఆరాచకత్వానికి దారి తీస్తుంది అనే ప్రశ్నకు వర్గ రహిత సమాజంలో రాజ్య అవసరం ఉండదని మార్క్స్ అలాంటి భవిష్యత్ సమాణంలో జ్ఞానవంతులైన మనుషులు (Enlightened) సహజీవనంతో జీవిస్తారని గాంధీ భావించారు. ఈ భావన చాలా ఉద్గాతమైనది. రాజ్య వ్యవస్థకు ఉండే ప్రధానమైన లక్షణం బలప్రయోగం, మనుషులు, సమాజాలు చైతన్యవంతమైన కొద్దీ రాజ్య అవతారం కొంత మారుతూ వచ్చింది. రాజ్యాంగం, చట్టబద్ద పాలన, సంక్షేమరాజ్యం, ఎన్నికల ద్వారా ప్రజలకు జవాబుదారీ తనం లాంటి మార్పులు వచ్చాయి. రాజ్య బలప్రయోగ అధికారాన్ని నియంత్రించడం. ఎలా అన్న సవాలు నుండి ఈ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తనకు తాను సృష్టించుకున్న తీవ్ర ఆర్థిక అసమానతలను సమర్థించుకొనడానికి ప్రజాస్వామ్య అధికారం కేంద్రీకృతం కాకుండా భిన్నమైన స్వతంత్ర సంస్థలను ఏర్పరచుకుంది. దీనికి భిన్నంగా నియోలిబరలిజం అన్ని సంస్థలను కూలగొడుతూ సంపదను కొందరి చేతులోకి వేరే ప్రక్రియను సమర్ధించే క్రమంలో రాజ్యం బాహాటంగా హింసను ఉపయోగిస్తున్నది. అన్