Nippulanti Nijam
G. Vallishwar / జి. వల్లీశ్వర్ · History

Price: Rs. 270. డి.ఆర్. కార్తికేయన్ రాజీవ్ంధీ హత్యకేసును దర్యాప్తు చేయడానికి నియోగించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (Special Investigation Team - SIT) ప్రధానాధికారి. న్యాయవాద వృత్తి నుండి పోలీసు ఉద్యోగంలోకి వచ్చిన ఈయన వైవిధ్య పూరితమైన, అద్భుత వృత్తి జీవితాన్ని గడిపారు. 1964లో ఐపిఎస్లో చేరిన తర్వాత జిల్లా పోలీసు సూపరింటెండెంటు, పోలీసు శిక్షణ అకాడమీ డైరెక్టరు, కర్నాటకలో ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ ప్రధానాధికారి, మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో చాన్సరీ ప్రధానాధికారి, ఆస్ట్రేలియా లోని సిడ్నీలో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టరు, జాతీయ మానవ హక్కుల కమీషన్ డైరెక్టర్ జనరల్, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్, సిబిఐ డైరెక్టరు వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు. ప్రస్తుతం అనేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో విజిటింగ్ ప్రొఫెసర్గాను, అనేక ప్రభుత్వేతర, సమాజసేవక, స్వచ్ఛంద సంస్థలకు అధ్యక్షుడుగానో, ఉపాధ్యక్షుడుగానో, సలహాదారుగానో ఉంటున్నారు కార్తికేయన్. ఈ సంస్థలన్నీ మానవహక్కులు, విధులు, మానవ విలువలు, విద్య, పర్యావరణం, నీరు, వ్యవసాయం, మతసామరస్యం, ఆధ్యాత్మికత, సుపరిపాలన రంగాలలో కృషి చేస్తున్నాయి. మానవ హక్కులకు సంబంధించి వివిధ కోణాలు, విద్య, సంస్కృతి, శాంతి - సామరస్యం, విజ్ఞానశాస్త్రం - ఆధ్యాత్మికత, పోలీసు, నేరన్యాయం, ఉగ్రవాదం వంటి విషయాలపై పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులలో కార్తికేయన్ పాల్గొంటూ ఉన్నారు. రాధావినోద్రిరాజు 1975 బ్యాచి ఐపిఎస్ అధికారి. జమ్మూ-కాశ్మీర్ కాడరికి చెందినవారు. 1983 - 89 మధ్యకాలంలో కేరళలో సిబిఐ ఎప్పిగా ఎన్నో సంచలనాత్మక అవినీతి, హత్యా కేసులను విజయ వంతంగా దర్యాప్తు చేశారు. జమ్మూ-కాశ్మీర్ శీతాకాలపు రాజధాని జమ్మూ జిల్లా పోలీసు అధికారిగా 1990 ప్రారంభంలో కాశ్మీరులోయనుండి కాశ్మీరీ పండిట్ల మూకుమ్మడి వలసల విషమ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొన్నారు. 영 జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో అమూల్య అనుభవాన్ని గడించారు రాధావినోద్ రాజీవ్ గాంధీ హత్యకేసు దర్యాప్తు, విచారణలో శ్రీరాజు ఒక ముఖ్యమైన పాత్ర పోషించార