Ninnati Swapnam...Repati Lakshyam

Editor · Telangana Literature

Ninnati Swapnam...Repati Lakshyam book cover

Price: Rs. 135. కొన్ని చారిత్రక సందర్భాలకు కాలమే అంకురార్పణ చేస్తుంది. మానవ చరిత్రను మలుపు తిప్పిన అనేక మంది మహానుభావుల ఉద్భవం ఏదో ఒక కార్యకారణ సంబంధంతో ముడివడి ఉంటుంది. అణచివేతల్లోంచి ఒక ఆశయం మొలకెత్తుతుంది. నిర్బంధానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు చెలరేగుతుంది. ఆర్థిక, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా విప్లవాలే మొదలవుతాయి. బోయవాడు వాల్మీకిగా మారినా, సిద్ధార్థుడు బుద్ధుడిగా అవతరించినా, బలీయమైన ఒక సంఘటన తాలూకు భావ సంఘర్షణల్లోంచి పొందిన చైతన్యమే కారణం. తాను ప్రయాణించిన రైలులోంచి బలవంతంగా తోసేసిన జాత్యాహంకారాన్ని చవిచూడకపోతే, గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యోద్యమానికి నడుం కట్టేవాడు కాదేమో! నందులచే పరాభవమే జరిగి ఉండకపోతే చాణుక్యుడు చంద్రగుప్తునిచే మగధ మహాసామ్రాజ్యాన్ని స్థాపించి ఉండకపోయే వాడేనేమో! కడుపులు మాడే వేళలో కప్పం కట్టమని ప్రతాపరుద్రుడు వేధించడం వల్లే సమ్మక్క-సారలమ్మలు మహా పరాక్రమంతో పోరాడి వీరమరణం పొంది వనదేవతలై తెలంగాణ సమాజంచే పూజలందుకుంటున్నారు. ఇలా ఏ పోరాటాలైనా, ఏ ఉద్యమ నేతలైనా కాలంచే సృష్టించబడి కాలాన్ని శాసించగలిగే స్థాయికి చేరుకోవడం చరిత్ర నిండా మనం చూస్తున్నాము. తెరాస ఆవిర్భావం కానీ, కెసిఆర్ నాయకత్వాన్ని కానీ అదే చారిత్రక దృష్టి కోణంతో చూడవలసిన అవసరం ఉంది.

Browse more Telugu books