Ninnati Parimalalu

Editor · Biographies & Auto Biographies

Ninnati Parimalalu book cover

Price: Rs. 165. శ్రీరమణ ముందు పత్రికా రచయిత. తరువాతే కథారచయిత. పిన్నవయసులోనే సాహిత్యాధ్యయనం మొదలయ్యింది.. వివేకానందపట్ల అత్యంత అనురక్తి. పంతొమ్మిదేళ్ల వయసులో రచయిత అయ్యారు. పేరడీల రచనతో ఎందరో రచయితల, సాహిత్యపాఠకుల చూపును తనవైపు తిప్పుకున్నారు. రంగులరాట్నం శీర్షిక నాటిపాఠకులను ఉర్రూతలూగించింది. అనేక పత్రికలలో ఎన్నో శీర్షికలను నిర్వహించారు. సునిశితమైన పరిశీలనాజ్ఞానం, హాస్యపుపూతతో పదునైన వ్యంగ్యం శ్రీరమణ సొత్తు, పత్రికాజీవితం, బాపురమణలతో సుదీర్ఘసాంగత్యంతో శ్రీరమణకి ఎందరో మహనీయులతో ప్రత్యక్ష పరిచయం, వారిలో చాలామందితో స్నేహం ఏర్పడింది. వారందరి వలన ఎంతో నేర్చుకున్నాను అంటారు శ్రీరమణ. శ్రీరమణ కొందరి గురించి 'అల్పాక్షరములలో అనంతార్ధము'ను వి యిమిడ్చి వివిధ సందర్భాలలో పరిచయం చేశారు. వారిలో కొందరు నేడు కీర్తికాయులు. శ్రీరమణ చేసిన వ్యక్తిపరిచయాలన్నీ మీ ముందుకు వస్తున్నాయి. 'నిన్నటి పరిమళాలు'గా,

Browse more Telugu books