Niluvetthu Sakshyam
Editor · New Arrivals

Price: Rs. 120. "మేము జంతువులను వేటాడటానికి అడవుల్లోకి పోతాం, వారేమో మాలాంటి మనుషులను వేటాడడానికి పోతారు.” “నాపై అత్యాచారం చేసిన తరువాత వారు నన్ను బెదిరించారు, నోరు మూసుకొమ్మన్నారు. వారు చేసింది ఎవరితోనైనా చెబితే, మళ్ళీ వచ్చినపుడు కాల్చి పారేస్తామన్నారు.' “పోలీసులు, భద్రతా బలగాలు వంతులవారీగా మమ్ముల బాదుతూ, మా రొమ్ములను పిండినారు, చనుమొనలు గిల్లినారు, మా పొట్టలను, వీపును, తొడలను తడిమినారు. ఇలా చేస్తూ వెకిలిగా, పరిహసిస్తూ నవ్వినారు". పెద్దగెల్లూరు, నేంద్రా, కున్నా, కోర్చోలి: ఇవి గణతంత్ర ప్రాంతానికి కాపలా స్థావరాలు, ఇక్కడ నివసించే ఆదివాసీలు అడవులపై ఆధారపడి, జీవనాధార సేద్యం చేస్తారు. రాజ్యం, గసుల కార్పోరేట్లు, భద్రతా సిబ్బంది, నిఘా బృందాల చేతుల్లో వీళ్ళు మాటల్లో చెప్పలేని విధంగా విధ్వంసం చేయబడ్డారు. "నిలువెత్తు సాక్ష్యం: దక్షిణ ఛత్తీస్ గఢ్ లో జరిగిన లైంగికహింస", అన్నది భద్రతా బలగాల చేతిలో సామూహిక అత్యాచారాలకు, లైంగికదాడికి, వివస్త్రం, లైంగికహింసకు గురైన ఆదివాసీ మహిళల నాలుగు సంఘటనలకు సంబంధించిన అత్యంత శ్రద్ధగా సేకరించిన సాక్షాధారాల వివరణ. అధికారిక ఉదాసీనత, భయపెట్టడం, బెదిరింపులను తట్టుకుని బాధితులు ముందుకు వచ్చి జవాబుదారీతనాన్ని, న్యాయాన్ని కోరడానికి ఎన్నో ఆటంకాలను అధిగమించారు. ఇది వారి చరిత్ర. నిలువెత్తు సాక్ష్యం: దక్షిణ ఛత్తీస్ గఢ్ లో లైంగికహింస" అనేక మంది వ్యక్తులు ఈ ప్రయత్నంలో సహకరించారు. కొందరు నిజనిర్ధారణ బృందాలకు సహాయం అందించారు. సంఘటనా స్థలాలకు, బాధితుల ఆవాసాలకు చేరుకోవడానికి సహకరించారు. బాధితులు చెప్పిన విషయాలను వారి భాష నుండి అనువాదం చేయడంలో, అర్థం చేసుకోవడంలో తోడ్పాటు వందించారు. మరికొందరు అనేకసార్లు రాసిన ముసాయిదా ప్రతులలోని లోపాలను గుర్తుపట్టేందుకు సహాయం చేశారు. వారందించిన అమూల్యమైన సలహాలు, చేసిన వాఖ్యలు ఈ పుస్తకాన్ని రూపొందించడంలో, దానికి మార్గం చూపడంలో సహాయపడ్డాయి. అందుకని ఈ పుస్తకం ఒక సమష్టి కృషి అనడం అన్ని రకాలుగా సబబు ఉంటుంది.