Nikkamaina Neelalu Vemana Padyalu

పి. రాజేశ్వరరావు / P. Rajeshwara Rao · Novels

Nikkamaina Neelalu Vemana Padyalu book cover

Price: Rs. 280. ఇందులో ప్రజాకవి వేమన చెప్పిన నిక్కమైన నీలాలు అనదగినవీ, నేటికీ మేటిగా నిలువదగినవీ 1626 పద్యాలు భావసహితంగా ఉన్నాయి. తెలుగు శతక సాహిత్యానికి కవితా ప్రామాణికతను, చారిత్రక పరిపుష్టిని కలిగించిన రచనల్లో వేమన పద్యాలు ప్రముఖపాత్ర వహిస్తాయనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. వేమన సంపన్నమైన రెడ్డి, కాపు కులంలో జన్మించి సంసారంలో అనేక ఒడిదొడుకులకులోనై ఆనాడు దేశంలో అస్తవ్యస్తంగా వున్న వివిధ మత, సాంఘికాది విషయ పరిస్థితులకు సంక్షుభిత మనస్కుడై కాలక్రమంలో విరక్తచిత్తుడై, సంసారం త్యజించి యోగియై, తత్వజ్ఞానం పొంది దేశం నలుమూలలా సంచరించి తన అనుభవాన్ని, నమ్మకాన్ని, నిర్మొహమాటంగా, సూటిగా - తేట తెలుగు మాటలలో ప్రజలకు బోధించారు. వీరి బోధనలు ఆటవెలదులై, తేటగీతలై ఆంధ్ర సరస్వతికి ఆణిముత్యాల హారాలై అలరించాయి. ఆచారాన్ని, తత్వాన్నిబట్టి చూస్తే వేమనకు ఏ జాతీ లేదు. జాతి, మత, సాంఘికాది భేదాలను వేమన తీవ్రంగా ఖండించారు. అన్నాయాన్ని, మోసాన్ని, ఏ మాత్రం సహింపని చిత్తవృత్తి గలవారు వేమన. తాను చెప్పింది ఎదుటివారికి ఆహ్లాదంగాను, మనసుకు హత్తుకునేందుకుగాను తన పద్యాలలో వ్యంగ్యాన్ని, హాస్యాన్ని, చతురోక్తిని జోడించారు. కనుకనే వేమన పద్యాలు పండిత, పామర జనులకు ఇష్టపద్యాలయ్యాయి. పెద్ద విషయాన్ని చిన్న సూక్తిలో లోకోక్తిగా చెప్పడంలో వేమనకు సాటిరాగల ఆంధ్రకవి నభూతో నభవిష్యతి.

Browse more Telugu books