Nijam Palana ChivariRojulu

Editor · History

Nijam Palana ChivariRojulu book cover

Price: Rs. 225. భారతదేశం ఒకే దేశంగా మనగలగాలంటే, భారతదేశంలోని ముస్లింలు అంతా ఈ దేశానికి చెందినవారమనీ, ఈ దేశంతో విడదీయరాని వారసత్వం తమదనీ అంగీకరించాలి. తాము ప్రత్యేకం అన్న భావన రానీయకూడదు. పాకిస్తాన్ పట్ల ఎలాంటి విధేయతను, సమర్థనను చూపకూడదు. దేశంలోని ఇతరులపట్ల ఎలాంటి వైరి భావనను ప్రదర్శించకూడదు. ఇది నాకన్నా సర్దార్ భావన. కాబట్టి, నా ఆలోచనల గురించి ఇంత తెలిసీ నన్ను హైదరాబాద్ పంపించారంటే, నా అభిప్రాయాలను పరిగణనలోకి తప్పకుండా తీసుకునే ఉంటారు. 208458 అందుకే ‘ముందు మున్షీ వచ్చాడు, వెనుక భారత్ సైన్యం వస్తుంది', అంటే నేను అడ్వాన్స్ గార్డ్ లాంటి వాడినని, ఓ పత్రిక వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. 'హైదరాబాద్పై ఆధిక్యం సాధించటం కోసం హైదరాబాద్లో ఉన్న అంతర్గత గూఢచారిలాంటి వాడు మున్షీ' అని భారత్ దృక్కోణం పట్ల ఏ మాత్రం సానుభూతి లేక భారత్ని ద్వేషించే ఓ బ్రిటీష్ కాలమిస్ట్ రాశాడు. గ్రీకు పురాణంలో ట్రాయ్ నగరాన్ని గెలుచుకునే ఓ పెద్ద గుర్రం బొమ్మలో సైనికులు దాగి నగరంలోకి రహస్యంగా ప్రవేశించిన 'ట్రోజన్ హార్స్' లాంటి వాడినని వ్యాఖ్యానించాడు. నేను ట్రోజన్ హార్స్ లాంటి వాడినో కానో కానీ, నా జీవితం, నా పని, నా దృక్కోణాలు మాత్రం అందరికీ స్పష్టంగా తెలుసు.

Browse more Telugu books